The Warrior: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్, టైమ్ ఫిక్స్ చేసుకున్న వారియర్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను....

The Warrior: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్, టైమ్ ఫిక్స్ చేసుకున్న వారియర్

Ram Pothineni The Warrior Locks Date And Time For Pre Release Event

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి ఔట్ అండ్ ఔట్ పవర్‌ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!

ఈ సినిమాలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రగా రామ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్.

The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!

అయితే ఇప్పుడు తెలుగులోనూ ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది ది వారియర్ టీమ్. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూలై 10న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని JRC Conventionsలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.