Ram Setu: ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రామ్ సేతు’

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు.

Ram Setu: ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రామ్ సేతు’

Ram Setu Movie Locks OTT Release Date

Ram Setu: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ట్రైలర్ వరకు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు.

Ram Setu: ‘రామ్ సేతు’లో అక్షయ్ కుమార్ నీటి మీద నడుస్తున్నాడా? ఫ్లోటింగ్ స్టోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

కట్ చేస్తే.. ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాలో అడ్వెంచర్ ఎపిసోడ్స్ చాలానే ఉన్నా, సరైన స్క్రీన్‌ప్లే లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. దీంతో ఈ సినిమాకు తొలిరోజునే దారుణమైన టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గెటప్ కూడా ఈ సినిమాకు మైనస్ అని రివ్యూవర్లు చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో కాస్తోకూస్తో ఏదైనా మంచి అంశం ఉందంటే, అది ఖచ్చితంగా మన తెలుగు యాక్టర్ సత్యదేవ్ పాత్ర అని బాలీవుడ్ క్రిటిక్స్ సైతం చెప్పుకొచ్చారు.

Ram Setu: అక్షయ్ కుమార్ “రామసేతు” టీజర్ అదరహో..

ఈ సినిమాలో సత్యదేవ్ పాత్రను చక్కగా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఇక బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో డిజాస్టర్‌గా మిగలగా, తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 23 నుంచి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లే మేకర్స్ అనౌన్స్ చేశారు. అభిషేక్ శర్మ తెరకెక్కించిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.