Adipurush : ఆదిపురుష్ నుంచి మరో సాంగ్.. రామ్ సీత రామ్!

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. రామ్ సియా రామ్ అని సాగే ఈ సాంగ్..

Adipurush : ఆదిపురుష్ నుంచి మరో సాంగ్.. రామ్ సీత రామ్!

Ram Siya Ram song out from Prabhas Kriti Sanon Adipurush movie

Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నారు. ఇక ఇటీవల జై శ్రీరామ్ అనే సాంగ్ ని రిలీజ్ చేయగా అది కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్ ని రిలీజ్ చేశారు.

Prabhas : ప్రభాస్ సినిమాల నుంచి యూవీ అవుట్.. 3 మూవీలను సొంతం చేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ!

రామ్ సియా రామ్ (Ram Siya Ram) అని సాగే ఈ సాంగ్ తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించారు. ఈ పాట కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న నిర్వహించబోతున్నారు. తిరుపతిలో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఆదిపురుష్ కి కూడా వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసిందే.

Bro : మామా అల్లుళ్ళ డబుల్ బొనాంజా ట్రీట్.. కొత్త పోస్టర్ రిలీజ్!

అయితే ఇప్పుడు ఆ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని ఏకంగా 170 కోట్లకు పీపుల్ మీడియా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు. కాగా ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. జూన్ 16న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.