Ramarao on Duty: ఫీల్ గుడ్ మెలోడీగా ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ రిలీజ్!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం..

Ramarao on Duty: ఫీల్ గుడ్ మెలోడీగా ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ రిలీజ్!

Ramarao On Duty

Ramarao on Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ఖిలాడి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మాస్ రాజా. అయితే ఈసారి ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు తన సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాడు రవితేజ.

Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని ఫస్ట సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బుల్ బుల్ తరంగ్ అంటూ సాగే ఈ మెలోడీని సిద్ శ్రీరామ్ పాడడంతో పాటకి మరో రూపం సంతరించుకుంది. రజీషాపై రవితేజకు ఉన్న ప్రేమనంతా తన లిరిక్స్‌తో తెలియజేశాడు రాకేందు మౌళి. సామ్‌ సీఎస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించగా.. ఈ లవ్లీ రొమాంటిక్‌ మెలోడీలో రవితేజ, రజీషాల కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది.

Ramarao on Duty: Ko2 దర్శకుడితో మాస్ మహరాజ్.. రామారావు ఆన్ డ్యూటీ!

రవితేజ సరికొత్త లుక్‌తో నటిస్తున్న ఈ సినిమాలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సామ్.సిఎస్ సంగీతం అందిస్తుండగా, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 17న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.