Ramarao on Duty: Ko2 దర్శకుడితో మాస్ మహరాజ్.. రామారావు ఆన్ డ్యూటీ!

వరుస ఫ్లాప్‌ల తర్వాత క్రాక్ సినిమాతో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఆర్టి టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.

Ramarao on Duty: Ko2 దర్శకుడితో మాస్ మహరాజ్.. రామారావు ఆన్ డ్యూటీ!

Rama Rao

Ravi Teja unveils first look of RT68: వరుస ఫ్లాప్‌ల తర్వాత క్రాక్ సినిమాతో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఆర్టి టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రానికి ”రామారావు ఆన్ డ్యూటీ” అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

రవితేజ కెరీర్‌లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో డైరెక్టర్‌ శరత్ మండవ తెలుగుకు పరిచయం కాబోతున్నాడు. రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. ర‌వితేజ స‌ర‌స‌న మ‌జిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాస్ రాజా రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్ – ఫార్మల్ ప్యాంట్ ధరించి ట్రెండీ గాగుల్స్ పెట్టుకొని సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ పోస్టర్‌లో రవితేజ ప్లే చేస్తున్న బి.రామారావు పేరుతో ప్రమాణ స్వీకార పత్రం కూడా ఉంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డులను బ్యాగ్రౌండ్ లో చూడవచ్చు.

శరత్ మండవ గతంలో తమిళ్‌లో Ko 2(King 2) అనే సినిమాను బాబీ సిన్హా ప్రధాన పాత్రలో తీశారు. అక్కడ సూపర్ హిట్ అయిన Ko 2 సినిమా తెలుగులో నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమా రీమేక్. ఈ సినిమా తమిళ్‌‌లో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కోటాశ్రీనివాస్ చేసిన పాత్రను తమిళ్‌లో ప్రకాష్ రాజ్ చేశారు. ముఖ్యమంత్రిని కామన్ మ్యాన్ కిడ్నాప్ చెయ్యడం అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.