RRR Trailer: ఆ రెండు ఫ్రేమ్‌లు చాలు.. చరణ్, ఎన్టీఆర్.. చంపేశారంతే..!

మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా ట్రైలర్.. వచ్చేసింది. వస్తూ వస్తూనే యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ విజువల్ ఫీస్ట్‌లో.. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంది.

RRR Trailer: ఆ రెండు ఫ్రేమ్‌లు చాలు.. చరణ్, ఎన్టీఆర్.. చంపేశారంతే..!

Rrr

RRR Trailer: మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా ట్రైలర్.. వచ్చేసింది. వస్తూ వస్తూనే యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ విజువల్ ఫీస్ట్‌లో.. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఫ్యాన్స్ కైతే.. పూనకాలు తెప్పిస్తోంది. మాస్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోవడం ఖాయమన్న మాట.. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

ముఖ్యంగా.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్లను ఎలివేట్ చేసిన తీరుకు.. దర్శక ధీరుడు రాజమౌళికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. పులితో ఎన్టీఆర్ ఫేస్ టు ఫేస్ గర్జన చూపించిన ఫ్రేమ్ అయితే.. ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ కు మించిన ఫీలింగ్ కలిగిస్తోంది. ఆ తర్వాత.. యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ చూపించిన తెగువకు సాటి లేదు అన్న మాటే బదులుగా వినిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే.. ఇప్పటికే నాటు స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్.. ఈ ట్రైలర్ తో మళ్లీ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాడు.

జూనియర్ ఎన్టీఆర్ దే ఈ రేంజ్ లో ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది మరో రేంజ్ అన్నట్టుగా జక్కన్న రాజమౌళి ప్లాన్ చేసిన తీరుకు.. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఈ ట్రైలర్ లో చరణ్.. 2 షేడ్స్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్ గా ఓ షేడ్ అయితే.. అల్లూరి సీతారామరాజుగా మరో షేడ్ లో.. అదరగొట్టాడు. బ్రిటీష్ వారితో చేసిన యుద్ధంలో.. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో ఉన్న చరణ్.. మంటల్లోంచి బయటికి వచ్చే సీన్ గురించి అయితే.. అసలు మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. చూసి ఎంజాయ్ చేయాల్సిందంతే.

ఆ తర్వాత.. భీమ్ – రామ్.. ఇద్దరూ కలిసి చేసిన ఫైట్.. మామూలుగా లేదు. ఇద్దరూ కలిసి పోటీ పడి మరీ చేసిన ఫీట్లు.. నెక్స్ట్ లెవెల్ అన్న మాటకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాయి. అజయ్ దేవగన్, శ్రీయ, రాజీవ్ కనకాల.. ఇలా సీనియర్ యాక్టర్స్ అంతా కలిసి.. ఈ ట్రైలర్ తో విజువల్ ఫీస్ట్ ఇచ్చారు. RRR సినిమా ప్రమోషన్స్ ను ట్రైలర్ తో మరో స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో ఇంకెంత రచ్చ చేస్తారో అన్న చర్చ మొదలైంది.

Read More:

RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‌లో వచ్చేసింది.. అరాచకం అనేది చిన్నపదమే!

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

RRR: విజువల్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన రన్ టైం..!

RRR Janani Song : జనని పాటలో ఈ 15 ఫ్రేమ్స్ గూస్ బంప్స్

RRRలో ఐటెం సాంగ్ ఉందా మావా.. ఆర్ఆర్ఆర్ టీం ఫన్నీ రిప్లై!

RRR Janani Song : జనని పాటలో ఈ 15 ఫ్రేమ్స్ గూస్ బంప్స్