‘ది క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా’.. స్మాల్ స్క్రీన్‌పై శివగామి..

10TV Telugu News

Ramya Krishna in Sa Re Ga Ma Pa: నా మాటే శాసనం అంటూ సెకండ్ సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ది క్వీన్ అఫ్ తెలుగు సినిమా రమ్యకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. టాలెంటెడ్ సింగర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ అతిపెద్ద సింగింగ్ ప్రోగ్రామ్‌గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన షో.. ‘సరిగమప’.. జీ తెలుగులో ‘సరిగమప-నెక్స్ట్ సింగింగ్ ఐకాన్’ పేరుతో త్వరలో ఈ షో ప్రసారం కానుంది.


అగ్ర కథానాయికగా ప్రేక్షకుల హ‌ృదయాల్లో చెరుగని ముద్ర వేసిన రమ్యకృష్ణ ఈ షోను హోస్ట్ చేయనున్నారు. తాజాగా Queen is Coming అంటూ ప్రోమో రిలీజ్ చేశారు. ‘బాహుబలి’లో శివగామి డైలాగ్‌తో రమ్యకృష్ణ ఎంట్రీ అదిరిపోయింది. ఇప్పుడు మరింత ఆసక్తికరంగా రూపొందుతున్న ‘సరిగమప-నెక్స్ట్ సింగింగ్ ఐకాన్’ త్వరలో ప్రసారం కానుంది.


https://www.instagram.com/p/CEtQM-klRvT/?utm_source=ig_web_copy_link