రానా, మిహికా బజాజ్ వివాహ వేడుక

  • Published By: madhu ,Published On : August 9, 2020 / 09:14 AM IST
రానా, మిహికా బజాజ్ వివాహ వేడుక

టాలీవుడ్ హీరో రానా ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికాడు. దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తంలో మిహికా మెడలో ‘బాహుబలి’ స్టార్ రానా మూడు ముళ్లు వేశారు.

కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబాల నుంచి కేవలం 30 మంది బంధువులు మాత్రమే హాజరయ్యారని సమాచారం.

దగ్గుబాటి వారి మనవడు నాగ చైతన్య, సమంత దంపతులు సందడి చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్ ఇతరులు హాజరయ్యారు. అట్రాక్షన్ డ్రెస్ తో మిహికా ఆకట్టుకుంది. సంప్రాదాయ వస్త్రధారణ ధరంచాడు రానా.

ఈ పెళ్లికి రాని..వారు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ద్వారా వివాహం చూశారు. పెళ్లికి పిలవాలని అనుకున్నారో వారికి రానా ఈ టెక్నాలజీని పంపారు. వర్చువల్ రియాలిటీ ఉపయోగించి చూస్తే పెళ్లిలో అక్కడే ఉన్నట్లు అనిపిస్తుందంట. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. హ్యపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలియచేశారు.

పెళ్లికి ముందు…నిర్వహంచే సంప్రదాయబద్ధంగా నిర్వహంచే హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. ఇక పెళ్లికి హాజరయ్యే ప్రతొక్కరూ..కోవిడ్ -19 పరీక్షలు చేయించుకుంటారని, పెళ్లి వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయడం జరిగింది. భౌతిక దూరం పాటిస్తూ..వేడుక జరుగుతుందని ఇదివరకే..వరుడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.

దగ్గుబాటి రానా-మిహీకా బజాబ్ ఆగస్టు 8న పెళ్లి జరుగనుందని కుటుంబ సభ్యులు 2020, జూన్ 10వ తేదీన అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. పెళ్లి తంతు మూడు రోజుల పాటు నిర్వహించారు. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరిగాయి.

రానా దగ్గుబాటి కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడయ్యాడు.