ఫ్రెండ్ కోసం ర్యాప్ పాడిన రానా

విశాల్, తమన్నానటించిన ‘యాక్షన్’ మూవీలో దగ్గుబాటి రానా తన ఫ్రెండ్ విశాల్ కోసం ర్యాప్ పాడాడు..

  • Edited By: sekhar , November 11, 2019 / 07:39 AM IST
ఫ్రెండ్ కోసం ర్యాప్ పాడిన రానా

విశాల్, తమన్నానటించిన ‘యాక్షన్’ మూవీలో దగ్గుబాటి రానా తన ఫ్రెండ్ విశాల్ కోసం ర్యాప్ పాడాడు..

విశాల్, తమన్నా, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, ఆకాంక్ష ప్రధాన పాత్రధారులుగా.. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. ‘యాక్షన్’ నవంబర్ 15న తమిళ్, తెలుగులో భారీగా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో తన ఫ్రెండ్ విశాల్ కోసం దగ్గుబాటి రానా ఓ పాట పాడాడు.

ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ‘యాక్షన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు విశాల్. తాజాగా రానా పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిప్ హాప్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘లైట్స్ కెమెరా యాక్ష‌న్‌’.. అంటూ ఓ సాగే పాట‌ను తెలుగులో రానా పాడారు.

Read Also : ‘ఎల్సా’ పాత్రకు సితార పాప వాయిస్

‘తొలిసారి రానా పాట పాడారు. ఎంతో అద్భుతంగా పాడారు. థ్యాంక్యూ రానా’ అంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిప్ హాప్ మెసేజ్‌ను పోస్ట్ చేయ‌గా.. ‘నువ్వు లేక‌పోతే నేనీ సాహ‌సం చేసేవాడిని కాను.. థ్యాంక్యూ’  అంటూ రానా రిప్లై ఇచ్చాడు. రానా పాడిన ఈ ర్యాప్ సినిమాలో హైలెట్ అవుతుందని మూవీ టీమ్ తెలిపింది.