Virata Parvam: ఓటీటీలో విరాటపర్వం.. భారీ డీల్ సెట్?

మొన్నటి వరకు కరోనా మహమ్మారి దెబ్బకి చాలా సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా వగైరా అన్ని పనులు పూర్తయినా విడుదల విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంటూ వచ్చాయి. అయితే, కరోనా

Virata Parvam: ఓటీటీలో విరాటపర్వం.. భారీ డీల్ సెట్?

Virata Parvam

Virata Parvam: మొన్నటి వరకు కరోనా మహమ్మారి దెబ్బకి చాలా సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా వగైరా అన్ని పనులు పూర్తయినా విడుదల విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంటూ వచ్చాయి. అయితే, కరోనా నుండి బయటపడి మెల్లగా ఒక్కో సినిమా ఒక్కో మార్గంలో బయటకి వచ్చేశాయి. మొత్తంగా ఇన్నాళ్లు వివిధ స్థాయిలో ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కటిగా ముందుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు భారీ క్రేజీ సినిమాలు కూడా వేలకొద్దీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

Virata Parvam: విరాట పర్వం.. ఇక కష్టమేనా..?

అయితే.. దగ్గుబాటి రానా-సాయి పల్లవిల విరాట పర్వం సినిమా మాత్రం నిన్నటి వరకు ఎందుకు ఎక్కడ ఏ పరిస్థితిలో ఆగిందో కూడా బయటకి రాకుండా ఉంటూ వచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వచ్చే సినిమాలన్నీ వరసగా ఓటీటీలోనే విడుదల అవుతుండడంతో రానా విరాట పర్వం ఓటీటీలోనే విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఓ ఓటీటీతో డీల్ కూడా కుదిరిందని సురేష్ ప్రొడక్షన్ క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపించింది. ఆ తర్వాత ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయనున్నారని కూడా కథనాలొచ్చాయి.

Virata Parvam: విరాట పర్వం కాదు.. వాయిదాల పర్వం!

నిజానికి ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రెండు వారాల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. సెకండ్ వేవ్ ముగిసి అన్ని సినిమాలు పనులు మొదలైనా ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది ఎక్కడా బయటికి రాలేదు. అయితే, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశారట. అయితే.. భారీ సినిమాల మధ్యన ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు.

Virata Parvam: తండ్రీ కొడుకుల రిలీజ్ వార్.. ఫైనల్ గా ఓటీటీలోనే?!

కాగా.. ఇప్పుడు మరోసారి విరాట పర్వం సినిమా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుందని టాక్ మొదలైంది. నిజానికి తొలి నుండి నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. కారణాలేమైనా కావొచ్చు కానీ.. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీలో రాబోతుందట. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ దాదాపు రూ.50 కోట్లు డీల్ తో ఈ సినిమా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. డిజిటల్‌ రిలీజ్‌ కోసం రూ.41 కోట్లు, శాటిలైట్‌ హక్కుల కోసం రూ.9 కోట్లుకు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఇది ఎంతవరకు నిజమన్నది చూడాల్సి ఉంది.