Rana Daggubati : RRR, బాహుబలిని మించి ఆ సినిమా హిట్ అవుతుంది.. ప్రభాస్ సినిమాపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా నటుడు రానా దగ్గుబాటి ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ..

Rana Daggubati : RRR, బాహుబలిని మించి ఆ సినిమా హిట్ అవుతుంది.. ప్రభాస్ సినిమాపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rana Daggubati said Prabhas Project K Movie beats RRR and Bahubali Records

Prabhas :  మన తెలుగు సినిమాలు ఇటీవల దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా మన బాహుబలి(Bahubali) సినిమా ఫుల్ టైం రికార్డులని ఇంకే సినిమా బద్దలుకొట్టలేకపోయింది. బాలీవుడ్(Bollywood) లో చాలా సినిమాలు మన తెలుగు సినిమాలని దాటి హిట్ అవుతాయని భావించినా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక మన తెలుగు హీరోలు దేశవ్యాప్తంగా మార్కెట్ సంపాదించుకున్నారు. RRR, బాహుబలి సినిమాలని దాటి ఏ సినిమా వెళ్తుందా అని ఇప్పటికి చూస్తున్నారు.

తాజాగా నటుడు రానా దగ్గుబాటి ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమాలకు బౌండరీలు చెరిగిపోయాయి. నాకు తెలిసి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్న ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ K ఆ బౌండరీలు మరింత చెరిపేస్తుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా కూడా నటిస్తున్నారు. RRR, బాహుబలి సినిమాలు సాధించలేని రికార్డులు కూడా ఈ సినిమా సాధిస్తుంది. ఆ సినిమాల బౌండరీలను ప్రాజెక్ట్ K దాటుతుంది అని అన్నారు.

Ponniyin Selvan 2 : నేటి నుంచే ఓటీటీలో పొన్నియిన్ సెల్వన్ 2.. ఎందులోనో తెలుసా?

దీంతో రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో రానా, ప్రభాస్ కలిసి బాహుబలి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రాజెక్ట్ K సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి జనవరి 12న ప్రాజెక్ట్ K రిలీజ్ కానుంది.