Rana Daggubati : ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబినేషన్ బ్యాక్.. మలయాళ స్టార్ హీరో ముఖ్య పాత్ర?

నేనే రాజు నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామాతో సూపర్ హిట్టు అందుకున్న రానా, తేజ.. ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ని అలరించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో..

Rana Daggubati : ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబినేషన్ బ్యాక్.. మలయాళ స్టార్ హీరో ముఖ్య పాత్ర?

Rana Daggubati Teja collaborate again after success of Nene Raju Nene Mantri

Rana – Teja : దగ్గుబాటి హీరో రానా హీరోగా 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri). తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మెయిన్ హీరోయిన్ గా నటించగా.. కేథ‌రిన్ థ్రెసా (Catherine Tresa) మరో హీరోయిన్ గా బలమైన పాత్రలో నటించింది. బాహుబలి 2 లో విలనిజం చూపించిన రానా.. ఆ తరువాత ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి నెగటివ్ షేడ్స్ తో కూడా హీరోయిజం చూపించవచ్చు అని తెలియజేశాడు. సినిమా చివరిలో హీరో హీరోయిన్ పాత్రలను చంపేసి నెగటివ్ ఎండింగ్ ఇచ్చిన కూడా అభిమానులకు ఈ మూవీ బాగా నచ్చేసింది.

Toliprema Re Release : పవన్ క్లాసికల్ లవ్ స్టోరీ తొలిప్రేమ.. రీ రిలీజ్‌కి రెడీ అవుతుంది.. ఎప్పుడో తెలుసా?

ఇక ఇప్పుడు దాదాపు 6 ఏళ్ళ తరువాత రానా మళ్ళీ తేజతో కలిసి పని చేయబోతున్నాడు. తేజ ప్రస్తుతం రానా తమ్ముడు అభిరామ్‌ ని హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టిన తేజ.. రానాతో ఒక పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో లాగానే ఈ మూవీలో కూడా రానా పాత్ర చాలా పవర్‌ఫుల్ గా కనిపించబోతుందని తెలియజేశారు.

Adipurush : బాహుబలి సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న ఆదిపురుష్.. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడో తెలుసా?

ఇక ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరోని తీసుకు వస్తున్నాడట తేజ. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనున్నట్లు తెలియజేశారు. మరి నేనే రాజు నేనే మంత్రి మూవీతో ఆడియన్స్ లో కొన్ని అంచనాలను క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్.. ఇప్పుడు ఈ సినిమాతో ఆ అంచనాలని అందుకుంటారా? లేదా? చూడాలి. కాగా రానా భీమ్లా నాయక్, విరాటపర్వం సినిమాలు తరువాత ఇప్పటి వరకు మరో సినిమాలో కనిపించలేదు. అయితే ఇటీవల రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించాడు. త్వరలోనే ఆ సిరీస్ సెకండ్ సీజన్ తో రాబోతున్నాడు.