Bigg Boss: నాగార్జున తప్పుకున్నారా..? బిగ్‍‌బాస్ హోస్ట్‌గా యంగ్ హీరో?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్.. మరికొద్ది రోజుల్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను తెలుగులో పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఐదవ సీజన్‌ను సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.

Bigg Boss: నాగార్జున తప్పుకున్నారా..? బిగ్‍‌బాస్ హోస్ట్‌గా యంగ్ హీరో?

Nagarjuna

Bigg Boss Telugu season 5: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్.. మరికొద్ది రోజుల్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను తెలుగులో పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఐదవ సీజన్‌ను సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న ఈ షో నాల్గో సీజన్‌‌కి గతేడాది డిసెంబర్‌ 20న ఎండ్ కార్డ్ వేశారు. ఈ షో ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. సెకండ్ సీజన్‌కి నానీ, మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ చేశారు.

ఐదవ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా చేస్తారని అందరూ భావించగా.. లేటెస్ట్‌గా టాలీవుడ్ సర్కిళ్లలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ షోకి హోస్ట్‌గా నాగార్జున తప్పుకున్నారని, నాగార్జున ప్లేస్‌లోకి దగ్గుబాటి వారసుడు రానా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. వరుస సినిమాలను ప్రకటించిన నాగ్.. సెప్టెంబర్‌లో కరోనా గ్యాప్‌లో షూటింగ్‌లను పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే బిగ్ బాస్ ఉండే అవకాశం ఉండడంతో నాగ్‌ తప్పుకున్నట్లుగా తెలుస్తుంది.

దీంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు పలువురు యంగ్‌ హీరోలను సంప్రదించగా.. రానా దగ్గుబాటిని ఫైనల్‌ చేసినట్లుగా తెలుస్తుంది. ‘నెంబర్‌ వన్‌ యారీ’అనే షోతో హోస్ట్‌గా ఇప్పటికే అనుభవం ఉన్న రానా.. బిగ్‌బాస్‌ 5 సీజన్‌ని కూడా నడిపిస్తారని భావిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగు సీజన్లను ముగ్గురు స్టార్ హీరోలు అద్భుతంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగా.. ఇప్పుడు కూడా క్రేజ్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే ప్రక్రియను నిర్వాహకులు స్టార్ట్ చెయ్యగా.. ఆగస్ట్‌లో కంటెస్టెంట్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని, షోలో ఎంట్రీకి ముందు వారం రోజులు క్వారంటైన్‌లో ఉండడమే కాక.. కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధనలను కూడా నిర్వాహకులు పెట్టారంట. చూడాలిమరి ఈసారి బిగ్‌బాస్ ఎలా ఉండబోతుందో?

 

View this post on Instagram

 

A post shared by Rana Daggubati (@ranadaggubati)