Rana Daggubati : కొత్త కథలను ఒప్పించాలంటే సినీ పరిశ్రమలో చాలా కష్టం.. రెండేళ్లు తిరిగినా ఉపయోగం లేదు..
రానా గతంలో పలు చిన్న సినిమాలను రిలీజ్ చేశాడు. తిరువీర్ ముఖ్య పాత్రలో నటించిన పరేషాన్ అనే చిన్న సినిమాను రానా నేడు రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో రానా కూడా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Rana Daggubati why encouraging small movies
Rana Daggubati – Pareshan : ప్రస్తుతం రానా దగ్గుబాటి ఓ పక్కన హీరోగా, లీడ్ క్యారెక్టర్స్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా పలు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. బాగున్న చిన్న సినిమాలను తనే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. అలా ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తాజాగా తెలిపారు రానా. రానా గతంలో పలు చిన్న సినిమాలను రిలీజ్ చేశాడు. తిరువీర్ (Thiruveer) ముఖ్య పాత్రలో నటించిన పరేషాన్ (Pareshan) అనే చిన్న సినిమాను రానా నేడు రిలీజ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ (Movie Promotion) లో రానా కూడా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తాజాగా ఓ ప్రమోషన్ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. యాక్టర్ అవ్వకముందే నిర్మాతగా వ్యవహారాలు చూసుకున్నాను. బొమ్మలాట అనే ఓ చిన్న సినిమాను నిర్మాతగా తెరకెక్కించాను. ఆ సినిమాకు నేషనల్ అవార్డులు వచ్చినా థియేటర్స్ లో రిలీజ్ కాలేకపోయింది. చిన్న సినిమాలు అంత తొందరగా రిలీజ్ అవ్వవని, అది నాకైనా అంతే అని అప్పుడే అర్థమైంది. నేను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కొన్ని కథలను పట్టుకొని కొంతమంది డైరెక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని వర్క్ చేయమని అడిగాను. రెండేళ్లు ఆ కథలు పట్టుకొని తిరిగినా నాకు కూడా ఎవరూ ఓకే చెప్పలేదు. కొత్త కథల ఎంపికలో సినీ పరిశ్రమను ఒప్పించడం చాలా కష్టం అని అర్థమైంది అని అన్నారు.
Pareshan Twitter Review : పరేషాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్స్ లో మస్తు పరేషాన్ చేశారంట..
అందుకే.. ముందు నటుడిగా మారి కొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ చిన్న సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నాను. నటుడిగా గుర్తింపు వచ్చాక, సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఇండటంతో బాగున్న చిన్న సినిమాలను, మంచి కథలను ఎంకరేజ్ చేస్తూ వాటిని రిలీజ్ చేస్తున్నాను అని తెలిపారు రానా. ఇప్పుడు కొత్త కొత్త కథలను ఇండస్ట్రీ ఆహ్వానిస్తుందని, గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు.