Rana Naidu : ఒకరోజు ముందే ఫ్రీగా రానా నాయుడు ప్రీమియర్స్.. కానీ వాళ్లకే..

రానా నాయుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ఈ సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ నిర్వహించారు........................

Rana Naidu : ఒకరోజు ముందే ఫ్రీగా రానా నాయుడు ప్రీమియర్స్.. కానీ వాళ్లకే..

Rana Naidu Free Premiere Shows for Act Fiber Net users

Rana Naidu :  ఇటీవల స్టార్ హీరోలు, ఆర్టిస్టులు అంతా ఓటీటీ బాట పట్టి పలు వెబ్ సిరీస్ లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి బాబాయ్ – అబ్బాయిలు వెంకటేష్-రానా కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కిన రానా నాయుడు సిరీస్ మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ లో సెలబ్రిటీలకు సమస్యలు వస్తే వాటిని తీర్చే పాత్రలో రానా కనిపిస్తుండగా రానా తండ్రిగా వెంకటేష్ నెగిటివ్ రోల్ లో కనపడనున్నాడు.

రానా నాయుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ఈ సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ నిర్వహించారు. ఓ ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ సిరీస్ కి ACT ఫైబర్‌నెట్ సంస్థ ప్రమోషనల్ పార్ట్నర్ గా ఉంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తో కలిసి ACT ఫైబర్‌నెట్ సంస్థ పలు ఆఫర్స్ ని వినియోగదారులకు ప్రకటిస్తుంది.

Ram Charan : నేను ఆస్కార్ కోసం వెళ్లడం లేదు.. వాళ్ళ కోసమే వెళ్తున్నాను.. రామ్‌చరణ్!

తాజాగా రానా నాయుడు సిరీస్ ని మార్చ్ 9న అంటే రిలీజ్ కి ఒక రోజు ముందే ప్రీమియర్ వేయనున్నట్టు ACT ఫైబర్‌నెట్ సంస్థ ప్రకటించింది. అయితే ఇది కేవలం ACT ఫైబర్‌నెట్ కస్టమర్లకు మాత్రమే. ఆల్రెడీ ACT ఫైబర్‌నెట్ ఉన్నవాళ్లు లేదా కొత్తగా కనెక్షన్స్ తీసుకున్నవాళ్లకు హైదరాబాద్ తో పాటు వైజాగ్, విజయవాడలోని పలు థియేటర్స్ లో ఉచితంగా రానా నాయుడు ప్రీమియర్ షో వేయనున్నారు. మీరు కూడా ACT ఫైబర్ నెట్ వినియోగదారులు అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. రానా నాయుడు సిరీస్ కోసం దగ్గుబాటి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.