Rana Naidu : మోస్ట్ వెయిటింగ్.. రానా నాయుడు టీజర్ అదిరిపోయిందిగా.. పోటాపోటీగా వెంకీ, రానా

రానా, వెంకటేష్ ఇద్దరూ కలిసి రానా నాయిడు అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ కోసం భారీగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేసింది...........

Rana Naidu : మోస్ట్ వెయిటింగ్.. రానా నాయుడు టీజర్ అదిరిపోయిందిగా.. పోటాపోటీగా వెంకీ, రానా

Rana Naidu teaser released from Netflix

Rana Naidu :  స్టార్ హీరోలు కలిసి చేసే మల్టీస్టారర్స్ మనకి చాలా ఇంట్రెస్ట్. అలాంటి మల్టీస్టారర్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తాం. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి చేస్తే ఆ ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు ఉంటాయి. తెలుగులో ఫ్యాన్స్ తో, సినిమాలతో సంబంధం లేకుండా అందరికి ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ మామ అంటే మన అందరికి చాలా ఇష్టం. ఇప్పటికే రకరకాల పాత్రలతో మెప్పించిన వెంకీ మామ ఈ సారి నెట్‌ఫ్లిక్స్ కోసం మరో సరికొత్త పాత్రతో రాబోతున్నాడు.

రానా, వెంకటేష్ ఇద్దరూ కలిసి రానా నాయిడు అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ కోసం భారీగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేసింది. అయితే ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ చేసింది. త్వరలో సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు.

Balakrishna : మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వంపై బాలయ్య ఫైర్..

ఇక ఈ టీజర్ లో.. రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది. సెలబ్రిటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసే ఓ పర్సన్ గా ఓ నెగిటివ్ రోల్ లో రానా ఇందులో కనిపించబోతున్నాడు. ఓ పెద్ద ప్రాబ్లమ్ రానా క్రియేట్ చేస్తే ఇందులో రానా ఉన్నట్టు తెలిసిపోతుంది. అయితే రానాని ఆపగలిగేది ఒక్కడే అని వెంకటేష్ ని రివీల్ చేశారు. ఇందులో వెంకటేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఒక వయసు మళ్ళిన పాత్రలో చాలా పవర్ఫుల్ గా చూపించారు. వీరిద్దరూ ఏదో ఒక దాని కోసం పోటీపడబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వెంకటేష్ జైలు నుంచి వచ్చినట్టు, రానాకి తండ్రి క్యారెక్టర్ అయినట్టు చూపించారు. టీజర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే టీజర్ కి హైలెట్ గా నిలిచింది.

Rana Naidu teaser released from Netflix

 

ఇక టీజర్ లో రొమాన్స్, యాక్షన్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఉన్నట్టు తెలిసిపోతుంది. పాన్ ఇండియా సిరీస్ గా తెరకెక్కించడంతో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో నటించారు. టీజర్ ని సడెన్ గా రిలీజ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు, వెంకీ మామ, రానా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టీజర్ చూసిన తర్వాత సిరీస్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సిరీస్ ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.