Virata Parvam: ఆలోచనాత్మక పాటతో సింగర్‌గా మారనున్న రానా!

చిరంజీవి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు పవన్ కళ్యాణ్ నుండి నితిన్ వరకు టాలీవుడ్ హీరోలలో చాలామంది ఏదో ఒక సందర్భంలో గొంతు సవరించి గాయకులుగా మారారు. ఆ పాటలు కూడా ఆయా సినిమాల సక్సెస్ కు..

Virata Parvam: ఆలోచనాత్మక పాటతో సింగర్‌గా మారనున్న రానా!

Virata Parvam

Virata Parvam: చిరంజీవి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు పవన్ కళ్యాణ్ నుండి నితిన్ వరకు టాలీవుడ్ హీరోలలో చాలామంది ఏదో ఒక సందర్భంలో గొంతు సవరించి గాయకులుగా మారారు. ఆ పాటలు కూడా ఆయా సినిమాల సక్సెస్ కు ఎంతగానో ఉపయోగపడగా ఇప్పుడు దగ్గుబాటి హీరో రానా కూడా సింగర్ మారేందుకు సిద్దమయ్యాడట. రానా హీరోగా తెరకెకెక్కుతున్న సినిమా కోసం ఓ ఆలోచనాత్మక పాటతో గాయకుడిగా మారనున్నాడట.

Most Eligible Bachelor: మళ్ళీ వెనక్కి వెళ్లిన బ్యాచిలర్!

రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ‘విరాటపర్వం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తవతుండగా వీలైనంత త్వరగా విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట. కాగా, ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న తాజా కథనాల ప్రకారం రానా త్వరలో ఈ సినిమాలో ఓ ఆలోచనాత్మక పాటను పాడబోతున్నాడని తెలుస్తుంది.

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

అక్టోబర్ మొదటి వారంలో ఈ పాట రికార్డ్ చేయబోతున్న ఈ పాట సినిమాలో చాలా కీలకంగా మారబోతుందని చెప్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కగా.. ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది.