Stars Business: రానా,విజయ్ నుండి తమన్నా,కీర్తి సురేష్ వరకు అందరిదీ వ్యాపారమే!

ఒకవైపు వెండితెర మీద ఓ వెలుగులో ఉండగానే సైడ్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టేస్తున్నారు మన స్టార్స్. ఒకప్పుడు ఈ ధోరణి ముంబై నటులకు ఉండగా ఇప్పుడు మన సౌత్ లో కూడా..

Stars Business: రానా,విజయ్ నుండి తమన్నా,కీర్తి సురేష్ వరకు అందరిదీ వ్యాపారమే!

South Stars Business

South Stars Business: ఒకవైపు వెండితెర మీద ఓ వెలుగులో ఉండగానే సైడ్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టేస్తున్నారు మన స్టార్స్. ఒకప్పుడు ఈ ధోరణి ముంబై నటులకు ఉండగా ఇప్పుడు మన సౌత్ లో కూడా మన నటులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఎవరికి వారు పలు యాడ్స్, ఓన్ బ్రాండ్స్ తో మార్కెట్ లోకి వస్తూనే మరికొందరు రెస్టారెంట్లు, సెలూన్ల వరకు, జువెల్లర్స్ నుండి ఫిట్నెస్ సెంటర్స్ వరకు అన్ని చోట్లా మన నటీనటులు అడుగుపెట్టేస్తున్నారు. ఇందులో దక్షణాది రాష్ట్రాలలో టాప్ రెస్టారెంట్లుగా పేరున్న చాలా వాటిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారివే ఎక్కువగా ఉండగా అందులో నటులవి కూడా భారీగానే ఉన్నాయి.

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటికి విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో పాటు క్వాన్ అనే టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఉంది. క్వాన్ (సౌత్) సెలబ్రిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రానా డైరెక్టర్ గా ఉన్నాడు. ఇక తమిళంలో క్రేజీ స్టార్ దళపతి విజయ్ చెన్నైలో భారీగా మ్యారేజ్ హాల్స్ కలిగి ఉన్నాడు. విజయ్ తల్లి పేరుమీద ఫంక్షన్ హాల్స్ నిర్మించాడు. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్​లో ‘వివాహ భోజనంబు’ పేరుతో పలు రెస్టారెంట్లు నడిపే ఈ హీరో త్వరలోనే ఏపీ రాజధాని అమరావతిలో త్వరలో ఒక సెలూన్​ను ప్రారంభించనున్నాడు.

మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ‘వైట్ అండ్ గోల్డ్’ అనే నగల బ్రాండ్‌ను కలిగి ఉంది. ఇది 5 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆన్‌లైన్ ఆభరణాల బ్రాండ్ కాగా.. దీని నుండి తమ్మూ భారీగానే వెనకేస్తుంది. ఇక సౌత్ లో అన్ని బాషలలో స్టార్ గా వెలిగిపోతున్న కీర్తి సురేష్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తన మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్‌తో కలిసి భూమిత్ర బ్రాండ్‌ పేరుతో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వీరితో పాటు పలువురు సౌత్ హీరోయిన్స్ ఫిట్నెస్ సెంటర్లు, కోచ్ లుగా బిజినెస్ చేస్తున్నారు.