Brahmastra: బ్రహ్మాస్త్రం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మాస్త’ ఇప్పటికే బాలీవుడ్ జనాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్‌తో....

Brahmastra: బ్రహ్మాస్త్రం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

Ranbir Kapoor Brahmastra Trailer Release Date Locked

Brahmastra: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మాస్త’ ఇప్పటికే బాలీవుడ్ జనాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

Brahmāstra: ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్.. ఇక రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్!

ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఇందులో అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, నాగార్జున, మౌనీ రాయ్ వంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 15న పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. రెండు భాగాలుగా రాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ తొలి భాగానికి ‘‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ : శివ’’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమా విడుదల వచ్చేసింది!

ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు సౌత్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి బ్రహ్మాస్త్రం తెలుగు వర్షన్‌లో ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుంతో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 9 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు మేకర్స్.