Ranbir kapoor : సెల్ఫీ అడిగాడని అభిమాని ఫోన్ విసిరేసిన రణబీర్..

తాజాగా రణబీర్ ఓ ఈవెంట్ లో పాల్గొని వెళ్తుండగా అభిమానులు అతన్ని చుట్టుముట్టారు. అతనితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అయితే ఈ సమయంలో ఓ అభిమాని రణబీర్ తో సెల్ఫీ తీసుకున్నాడు. అప్పటికే................

Ranbir kapoor : సెల్ఫీ అడిగాడని అభిమాని ఫోన్ విసిరేసిన రణబీర్..

Ranbir Kapoor throws Fan's Phone for annoying him for a Selfie

Ranbir kapoor :  బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కొన్ని నెలల క్రితమే బ్రహ్మాస్త్ర సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఇటీవలే రణబీర్ భార్య, హీరోయిన్ ఒక పాపకి జన్మనివ్వడంతో ప్రస్తుతం రణబీర్ పాపకి, అలియాకి టైం ఇస్తూ ఎక్కువగా ఇంటివద్దే ఉంటున్నాడు. అలాగే రెండు సినిమాలు రణబీర్ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక రణబీర్ కి అభిమానులు కూడా ఎక్కువే. మాములు నటులు కనిపిస్తేనే జనాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అలాంటిది రణబీర్ లాంటి స్టార్ హీరో కనపడితే జనాలు సెల్ఫీల కోసం తెగ ఎగబడతారు.

తాజాగా రణబీర్ ఓ ఈవెంట్ లో పాల్గొని వెళ్తుండగా అభిమానులు అతన్ని చుట్టుముట్టారు. అతనితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. అయితే ఈ సమయంలో ఓ అభిమాని రణబీర్ తో సెల్ఫీ తీసుకున్నాడు. అప్పటికే రణబీర్ చుట్టూ జనాలు ఉన్నారు. కానీ ఆ అభిమాని మాత్రం ఫోటో సరిగ్గా రాలేదని మరోసారి సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో కోపం వచ్చిన రణబీర్ ఒకసారి చూస్తానంటూ ఫోన్ తీసుకొని వెనక్కి విసిరేశాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

Srinivasa Murthi : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత..

అభిమాని ఫోన్ తీసుకొని రణబీర్ విసిరేయడంతో అక్కడ రణబీర్ ని తీస్తున్న వీడియోలలో ఇదంతా రికార్డ్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొంతమంది రణబీర్ ని విమర్శిస్తుంటే మరికొంతమంది అతనే మళ్ళీ మళ్ళీ ఫోటోల కోసం ట్రై చేశాడని, అతనిది కూడా తప్పు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు. గతంలో కూడా పలువురు స్టార్లు ఇలాగే అభిమానులు చేసిన పనికి అసహనంతో వాళ్ళ ఫోన్లు విసిరేశారు.