Vaishnav Tej : సమ్మర్‌కి గ్రాండ్ ముగింపు ఇవ్వనున్న వైష్ణవ్ తేజ్.. ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక హీరోలంతా వరుసగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుండటంతో వైష్ణవ్ కూడా 'రంగ రంగ వైభవంగా' సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సారి సమ్మర్ మొత్తం పెద్ద హీరోల సినిమాలు...

Vaishnav Tej :  సమ్మర్‌కి గ్రాండ్ ముగింపు ఇవ్వనున్న వైష్ణవ్ తేజ్.. ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ డేట్ ఫిక్స్

Vaishnav Tej

Ranga Ranga Vaibhavamgaa :  మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు వైష్ణవ్. రెండవ సినిమాగా ‘కొండపొలం’తో రాగా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా అందులో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇటీవలే తన మూడో సినిమాని కూడా అనౌన్స్ చేశాడు.

 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఆయన మూడో సినిమాని ఇటీవల అనౌన్స్ చేశారు. ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ తో వైష్ణవ్ రాబోతున్నాడు. ఇందులో వైష్ణవ్ సరసన కేతిక శర్మ నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకుంది ప్రేక్షకుల నుంచి.

Allu Arjun : తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

ఇక హీరోలంతా వరుసగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తుండటంతో వైష్ణవ్ కూడా ‘రంగ రంగ వైభవంగా’ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సారి సమ్మర్ మొత్తం పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఉండటంతో సమ్మర్ చివర్లో వైష్ణవ్ సినిమా రాబోతుంది. మే 27న వైష్ణవ్ నటిస్తున్న ‘రంగ రంగ వైభవంగా’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఇలా సమ్మర్ చివర్లో తన సినిమా రిలీజ్ చేసి సమ్మర్ కి గ్రాండ్ ముగింపు ఇవ్వాలి అనుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. ఇక మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సమ్మర్ లోనే రానుంది.