Ranga Ranga Vaibhavanga: కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్!

పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి..

Ranga Ranga Vaibhavanga: కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్!

Angaranga Vaibhavanga

Ranga Ranga Vaibhavanga: పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

RangaRanga Vaibhavanga : రిషి, రాధల ప్రేమకథ ‘రంగరంగ వైభవంగా’ ఉంటుంది..

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌లో ‘అర్జున్ రెడ్డి’ని తమిళ్‌లో తెరకెక్కించిన గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ మూడో సినిమా చేస్తున్నాడు. ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన తొలి పాట మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు ఈ సినిమా నుండి రెండో పాటని కూడా విడుదల చేశారు.

Vaishnav Tej: కొత్త సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన ఉప్పెన హీరో!

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్, కొత్తగా లేదేంటి రొమాంటిక్ మెలోడియస్ గా ఉంది. అర్మాన్ మాలిక్, హరి ప్రియ తమ గాత్రంతో దానిని మరింత అందంగా తీర్చిదిద్దారు. శ్రీమణి సాహిత్యం వినడానికి చాలా బాగుంది. విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూలై 1న విడుదల కానుంది.