రాణి ముఖర్జీ ‘Mardani 2’ షూటింగ్ మొద‌లు

  • Edited By: veegamteam , March 27, 2019 / 06:09 AM IST
రాణి ముఖర్జీ ‘Mardani 2’ షూటింగ్ మొద‌లు

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ సూపర్ హిట్ చిత్రం ‘మర్ధానీ’ సీక్వెల్ కి ఒకే చెప్పారని సమాచారం. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన కథాంశంతో రూపొందిన చిత్రం మ‌ర్ధానీ. 2014లో విడుద‌లైన ఈ చిత్రంలో రాణీ ముఖ‌ర్జీ ముఖ్య పాత్రలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.

ఆమె ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచింది. ఇక ఇప్పుడు మ‌ర్ధానీ చిత్ర సీక్వెల్‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది రాణీ ముఖ‌ర్జీ. ఇందులో శివానీ అనే పాత్ర‌లో సూప‌రింటెండెంట్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించ‌నుంది. నూత‌న ద‌ర్శ‌కుడు గోపి పుత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం షూటింగ్ మొద‌లైంద‌ని త‌రణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. 
Read Also : ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

ఆమె సినీ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మార్చి 26న ముంబైలో రాణి ‘మార్దాని 2’ కోసం షూటింగ్ ప్రారంభించారు. ఈ సినీమాలో విల‌న్‌కి, రాణీ ముఖర్జీకి మ‌ధ్య వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ‌ని టాక్.