కపిల్ దేవ్ కాదు రణ్‌వీర్

'83' మూవీ నుండి కపిల్ దేవ్ ట్రేడ్ మార్క్ నటరాజ్ షాట్ కొడుతున్న రణ్‌వీర్ సింగ్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు..

  • Published By: sekhar ,Published On : November 11, 2019 / 05:38 AM IST
కపిల్ దేవ్ కాదు రణ్‌వీర్

’83’ మూవీ నుండి కపిల్ దేవ్ ట్రేడ్ మార్క్ నటరాజ్ షాట్ కొడుతున్న రణ్‌వీర్ సింగ్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు..

క‌పిల్ దేవ్ తన న‌ట‌రాజ్ ట్రేడ్ మార్క్ షాట్ కొడతున్న లుక్ అదిరింది కదూ.. ఈ పిక్‌లో ఉన్నది క‌పిల్‌దేవ్ కాదండీ బాబూ.. బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌. భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవత్సరానికో ప్రత్యేక స్థానం ఉంది. క‌పిల్ దేవ్ నాయ‌క‌త్వంలో వెస్టీండిస్ టీమ్‌పై విజ‌యాన్ని సాధించి క్రికెట్ విశ్వ‌ విజేత‌గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించిన సంవ‌త్స‌ర‌మది. తొలిసారి ప్ర‌పంచ క్రికెట్ క‌ప్పును భార‌తావ‌ని ముద్దాడిన ఏడాది 1983.

ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో దీపికా ప‌దుకొనే, సాజిద్ న‌డియాడ్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ర‌ణ్‌వీర్ సింగ్ క‌పిల్‌దేవ్‌లా మేకోవ‌ర్ అయ్యాడు. ఓ క్రీడాకారుడిగా తనని తాను మార్చుకోవ‌డానికి ఆయ‌న ప‌డ్డ క‌ష్టం మ‌న‌కు తెర‌పై క‌న‌ప‌డుతుంది.

Read Also : డిసెంబర్ 5న ‘90 ఎంఎల్’

ఫ్యాన్స్ కోసం క‌పిల్‌దేవ్‌లా ఉన్న ర‌ణ్‌వీర్ సింగ్ లుక్‌ను మూవీ యూనిట్ విడుద‌ల చేసింది. అది కూడా ఆయ‌న ట్రేడ్ మార్క్ క్రికెట్ షాట్ న‌ట‌రాజ్ స్టిల్‌ను కావడం విశేషం. ఇప్పుడు ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో దీపికా ప‌దుకొనే అతిథిపాత్ర‌లో న‌టిస్తున్నారు. `83` చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తున్నారు.