Ranveer Singh: న్యూడ్ ఫోటోల కేసుపై పోలిసుల విచారణ.. మార్ఫింగ్ అంటున్న రణవీర్!

రణవీర్ సింగ్.. బాలీవుడ్ లో విచిత్రమైన ఫ్యాషన్ కి చిరునామా. చిరిగిన బట్టలు, సగం సగం బట్టలు, ఆడవాళ్ళ బట్టలు వేసుకొని ఫొటోలకు ఫోజలు ఇస్తుంటాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. ఇటీవల రణవీర్ ఒక మ్యాగజైన్ కోసం దిగిన న్యూడ్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో ఆ ఫోటోలు కొంత రచ్చకు దారి తీశాయి. ఈ క్రమంలో రణవీర్ పోలిసుల విచారణకు హాజరు కాగా...

Ranveer Singh: న్యూడ్ ఫోటోల కేసుపై పోలిసుల విచారణ.. మార్ఫింగ్ అంటున్న రణవీర్!

Ranveer Singh Comments on Nude Photos

Ranveer Singh: రణవీర్ సింగ్.. బాలీవుడ్ లో విచిత్రమైన ఫ్యాషన్ కి చిరునామా. చిరిగిన బట్టలు, సగం సగం బట్టలు, ఆడవాళ్ళ బట్టలు వేసుకొని ఫొటోలకు ఫోజలు ఇస్తుంటాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. అయితే ఈ ఫ్యాషన్ ని కొంతమంది అనుసరించే వాళ్ళు ఉన్నారు, అలానే ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ రణవీర్ ఇవేవి పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు చేసుకొంటూ పోతుంటాడు.

Ranveer Singh : ఈ రచ్చ ఏందయ్యా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్
ఇటీవల రణవీర్ ఒక మ్యాగజైన్ కోసం దిగిన న్యూడ్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో ఆ ఫోటోలు కొంత రచ్చకు దారి తీశాయి. “న్యూడ్ ఫొటోలతో సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ” కొంతమంది ప్రశ్నించగా, మరి కొంతమంది అయితే రణవీర్ సింగ్ పై కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో రణవీర్ పోలిసుల విచారణకు హాజరు కాగా, ఆ న్యూడ్ ఫోటోలు తనవి కావంటూ బదులిచ్చాడంట.

అసలు న్యూడ్ ఫోటో షూట్ లే నేను చేయలేదు, ఆ ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేశారంటూ వాపోయారంట రణవీర్. “ఫోటోలను మార్ఫింగ్ చేసి ఉంటే ఆ ఫోటోలను పోస్ట్ చేసింది మాత్రం రణవీర్ సింగే కదా, అయినా వినేవాడు ఉంటే ఇలాంటి వాళ్ళు ఎన్ని అయినా చెబుతారంటూ” నెటిజెన్లు కామెంట్ లు చేస్తున్నారు. కాగా ఇప్పటికి ఆ న్యూడ్ ఫొటోస్ ని రణవీర్ ఇంకా తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించకపోవడం గమనార్హం.