Ranveer Singh : షారుఖ్ ఖాన్‌తో పోటీకి వెళుతున్న రణ్‌వీర్ సింగ్.. కానీ సినిమాల్లో కాదు!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చివరిగా సర్కస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే.. పఠాన్ చిత్రంతో ఇటీవల 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ తో రణ్‌వీర్ ఇప్పుడు పోటీకి దిగుతున్నాడు.

Ranveer Singh : షారుఖ్ ఖాన్‌తో పోటీకి వెళుతున్న రణ్‌వీర్ సింగ్.. కానీ సినిమాల్లో కాదు!

Ranveer Singh going competite with Shah Rukh Khan with pepsi ad

Ranveer Singh : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చివరిగా సర్కస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడిక్ కామెడీ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాని కాప్ యూనివర్స్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే.. పఠాన్ చిత్రంతో ఇటీవల 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ తో రణ్‌వీర్ ఇప్పుడు పోటీకి దిగుతున్నాడు.

Ranveer Singh: బాలీవుడ్‍‌లో క్రాక్ చూపిస్తానంటోన్న సర్కస్ హీరో..?

పోటీ అంటే సినిమాల్లో కాదు, కమర్షియల్ యాడ్స్‌లో. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ థమ్సప్ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హాలీవుడ్ రేంజ్ లో స్టంట్స్ చేస్తూ ఒక యాడ్ కూడా చేశాడు. కాగా రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు పెప్సీ కూల్ డ్రింక్ కి న్యూ బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. కూల్ డ్రింక్స్ మార్కెట్ లో థమ్సప్ అండ్ పెప్సీ పోటీదారులు అని అందరికి తెలిసిందే. దీంతో థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ పాపులారిటీని మ్యాచ్ చేయడానికి పెప్సీ.. తమ బ్రాండ్ అంబాసిడర్ గా రణ్‌వీర్ సింగ్ ని రంగంలోకి దించడం ఆసక్తిగా మారింది.

కాగా తెలుగులో థమ్సప్ కి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక పెప్సీ విషయానికి వస్తే.. ప్రస్తుతం సౌత్ మొత్తాన్నికి బ్రాండ్ అంబాసిడర్ గా కేజీఎఫ్ హీరో యశ్ వ్యవహరిస్తున్నాడు. గతంలో తెలుగులో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వ్యవహరించారు. మరి ఇప్పుడు యశ్ నే కొనసాగిస్తారా? లేదా ఎవర్ని అన్నా తెలుగు హీరోని సంప్రదిస్తారా? అనేది చూడాలి.