Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..

రణవీర్ మాట్లాడుతూ.. నేను ఆర్ఆర్ఆర్ సినిమాని థియేటర్లో చూశాను. సినిమాలో వావ్ అనే మూమెంట్స్ చాలా ఉన్నాయి. మూడు గంటల పాటు హాల్లో జనాలు అంతా.......

Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..

Ranveer

Rajamouli :  బాహుబలి సినిమాతో దేశమంతటా పేరు సంపాదించి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు రాజమౌళి. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రాజమౌళి బ్రాండ్ తోనే నార్త్ లో ప్రమోట్ చేశారంటే రాజమౌళి క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ విజయం సాధించడంతో రాజమౌళి పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. బాలీవుడ్ హీరోలు, ఆర్టిస్టులు అంతా రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు తనకి సినిమా ఆఫర్ చేశారని రాజమౌళినే డైరెక్ట్ గా తెలిపారు.

రాజమౌళి దగ్గర సినిమా ఛాన్స్ కొట్టేయడానికి బాలీవుడ్ యాక్టర్లు అంతా కుదిరినప్పుడల్లా ఆయనని పొగుడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా రాజమౌళిని విపరీతంగా పొగిడేశాడు. రణవీర్ నటించిన జయేశ్ భాయ్ జోర్దార్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రణవీర్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామ..’ సాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ పై, రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..

రణవీర్ మాట్లాడుతూ.. నేను ఆర్ఆర్ఆర్ సినిమాని థియేటర్లో చూశాను. సినిమాలో వావ్ అనే మూమెంట్స్ చాలా ఉన్నాయి. మూడు గంటల పాటు హాల్లో జనాలు అంతా ఓ…ఓ.. అంటూ అరుస్తూనే ఉన్నారు ఆ సీన్స్ కి. ఈ సినిమాలో ట్రైన్ సీన్ దగ్గర హీరోలిద్దరూ చేయి పట్టుకున్న సీన్ నాకు బాగా నచ్చింది. ఆ సీన్ కి నేనైతే ఆల్మోస్ట్ చైర్లో నుంచి కిందపడినంత పని అయింది” అంటూ అక్కడే రాజమౌళి రాజమౌళి అంటూ అరుస్తూ కుర్చీలో కూర్చొని ఊగుతూ హడావిడి చేశాడు.

NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..

దీంతో రణవీర్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ పై, రాజమౌళిపై ప్రశంసలు కురిపించినందుకు కొంతమంది ఆనందిస్తుంటే, మరి కొంతమంది మీరు ఎంత కాకా పట్టిన మీకు రాజమౌళి ఛాన్స్ ఇవ్వడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోని ఆర్ఆర్ఆర్ సినిమా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కూడా షేర్ చేసి రణవీర్ సింగ్‌కి థ్యాంక్స్ చెప్పారు చిత్ర యూనిట్.