Janhvi Kapoor: బెల్లీ డాన్స్ తో మనసులు దోచుకున్న జాన్వీ.. సారా!

ఇద్దరూ స్టార్ కిడ్స్.. అసలే బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటంలో ఉన్న వాళ్ళు. సోషల్ మీడియానే షేక్ ఆడించే ఆ ఇద్దరికీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇస్తే ఊరికే ఉంటారా.. ఉర్రూతలూగించేయరు!. జాన్వీ కపూర్..

Janhvi Kapoor: బెల్లీ డాన్స్ తో మనసులు దోచుకున్న జాన్వీ.. సారా!

Janhvi Kapoor

Janhvi Kapoor: ఇద్దరూ స్టార్ కిడ్స్.. అసలే బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటంలో ఉన్న వాళ్ళు. సోషల్ మీడియానే షేక్ ఆడించే ఆ ఇద్దరికీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇస్తే ఊరికే ఉంటారా.. ఉర్రూతలూగించేయరు!. జాన్వీ కపూర్. సారా అలీఖాన్ అదే చేశారు. ఈ అందగత్తెలు తాజాగా బెల్లీ డాన్స్‌ తో అందరి మనసులను దొచుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.

Pooja Hegde: ఫస్ట్‌టైమ్ చీఫ్‌గెస్ట్‌గా హీరోయిన్.. పూజా రేంజ్ ఇది!

ఇప్పటికే ఈ స్టార్‌ వారసురాళ్లు ఇండస్ట్రీకి పరిచయమవగా.. భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. కాగా, తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చిన ఈ ఇద్దరూ బెల్లీ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌, సల్మాన్‌ ఖాన్‌ రియాలిటీ షోలను కూడా నిర్వహిస్తూ బుల్లితెర మీద ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేశారు. ఇప్పుడు అదే బాటలో రణ్‌వీర్‌సింగ్‌ కూడా ‘ది బిగ్‌ పిక్చర్‌’ అనే షోకి హోస్ట్‌ చేస్తున్నాడు. ఈ షో కలర్స్‌ టీవీలో ప్రసారమవుతోంది.

Liger: ఒక్క వీడియో రాలేదు.. కానీ పీక్స్‌కి చేరిన అంచనాలు!

తాజాగా ఈ షోకు గెస్ట్స్ గా వచ్చిన జాన్వీ కంపూర్, సారా అలీఖాన్ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ విడుదల చేయగా అందులో జాన్వీ గతంలో బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకుందని చెప్పింది. దీంతో తమకు దాన్ని నేర్పించమని అడిగాడు రణ్‌వీర్‌. తన నడుమును వయ్యారంగా ఊపుతూ వారికి చూపించింది ఈ బ్యూటీ. ప​క్కనే ఉన్న సారా ఆమెను ఉత్సాహపరుస్తూనే తను సైతం బెల్లీ డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించింది. మొత్తం ఇద్దరు లేత భామలతో రణవీర్ వయ్యారాలు పోతుంటే వీడియో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)