నువ్వే కావాలి : రాశీ ఖన్నాకు వరుస ఆఫర్లు

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 10:20 AM IST
నువ్వే కావాలి : రాశీ ఖన్నాకు వరుస ఆఫర్లు

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన వెంకీ మామ ఇటీవలే రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పక్కన హీరోయిన్ గా ”ప్రతి రోజూ పండగే” సినిమాలో రాశీ నటించింది. ఆ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. తొలి ప్రేమ సక్సెస్ తర్వాత తెలుగులో రాశీ ఖన్నా చేసిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఆ తర్వాత కోలీవుడ్ లో బిజీ అయ్యింది. పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. మళ్లీ తెలుగులోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ బిజీ అయింది. 2020 ఫిబ్రవరిలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన రాశీ నటించనుంది.

టాలీవుడ్ లో రాశీకి ఉన్న క్రేజ్, డిమాండ్.. ఈ మూడు సినిమాలతో ప్రూవ్ అయ్యిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టాప్ హీరోలంతా రాశీనే కోరుకుంటున్నారని చెబుతున్నారు. యాక్టింగ్ మాత్రమే కాదే ఇతర స్కిల్స్ కూడా రాశీ ఖన్నా సొంతం. స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. పైగా సింగర్ కూడా. ప్రతి రోజూ పండగే సినిమాలో రాశీ ఖన్నా పాడిన పాట ఇప్పటికే పాపులర్ అయ్యింది. ఈ పాటకు మంచి రెస్సాన్స్ వస్తోంది. భవిష్యత్తులో టాలీవుడ్ లో రాశీ ఖన్నాకి బ్రైట్ ఫ్యూచర్ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచుకుంది. జిల్లు మనే అందాలతో ఆడియన్స్ మతులు పోగొట్టింది. ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయికగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది.