Rashmika-Rishab : రష్మికని మర్చిపోయారా? కావాలనే ట్యాగ్ చేయలేదా?? మరోసారి రిషబ్-రష్మిక వివాదం..

రిషబ్-రష్మిక వివాదం కొన్ని రోజులు వార్తల్లో నిలిచింది. దీని గురించి అడిగితే రష్మిక ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంది. రిషబ్ కూడా రష్మికతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. తాజాగా రష్మిక మొదటి సినిమా కిరాక్ పార్టీ వచ్చి ఆరేళ్ళయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రిషబ్ శెట్టి.............

Rashmika-Rishab : రష్మికని మర్చిపోయారా? కావాలనే ట్యాగ్ చేయలేదా?? మరోసారి రిషబ్-రష్మిక వివాదం..

Rashmika and Rishab shetty issue goes viral again

Rashmika-Rishab :  నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీబిజీగా ఉండి. అయితే ఇటీవల రష్మిక అనుకోకుండానే వివాదాల్లో చిక్కుకుంటుంది. రెండు రోజుల క్రితమే సౌత్ పాటల్ని తక్కువ చేస్తూ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడి వివాదంలో నిలిచింది. కొన్ని రోజుల క్రితం సూపర్ హిట్ అయిన కన్నడ సినిమా కాంతార చూడలేదని, తనని ఇండస్ట్రీకి పరిచయం చేసింది అసలు వాళ్ళ పేరు కాకుండా ఏదో ఓ నిర్మాణ సంస్థ అని చెప్పి పెద్ద వివాదానికి తెరలేపింది.

రష్మికని అసలు సినీ పరిశ్రమకి పరిచయం చేసిందే కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమాతో రష్మిక సినీ పరిశ్రమకి పరిచయమైంది. అయితే దీని గురించి ప్రస్తావించకపోడంతో కన్నడ ప్రేక్షకులు రష్మికని టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. ఇక రిషబ్ కాంతార సినిమా కూడా చూడలేదని అనడంతో వివాదం బాగా ముదిరింది. కన్నడ ప్రేక్షకులు ఏకంగా రష్మికని బ్యాన్ చేయాలని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

Sudha : ఆ సమయంలో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని అలా చేశాడు.. స్టార్ హీరో అయినా వాడు అనే అంటాను..

దీంతో రిషబ్-రష్మిక వివాదం కొన్ని రోజులు వార్తల్లో నిలిచింది. దీని గురించి అడిగితే రష్మిక ఏదో సమాధానం చెప్పి తప్పించుకుంది. రిషబ్ కూడా రష్మికతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. తాజాగా రష్మిక మొదటి సినిమా కిరాక్ పార్టీ వచ్చి ఆరేళ్ళయింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రిషబ్ శెట్టి ఓ ట్వీట్ చేశాడు. హీరో రక్షిత్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్తూ, సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ లో సినిమా విజయంలో ముఖ్య పాత్ర వహించిన హీరోయిన్ రష్మికని ట్యాగ్ చేయకపోవడం విశేషం. హీరో, మ్యూజిక్ డైరెక్టర్స్, నిర్మాణ సంస్థల్ని ట్యాగ్ చేసి హీరోయిన్ ని ట్యాగ్ చేయకపోవడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కనీసం తన పేరు కూడా ప్రస్తావించకపోవడంతో మరోసారి వీరి వివాదం వెలుగులోకి వచ్చింది.

రష్మికని కావాలనే ట్యాగ్ చేయలేదా? రష్మిక-రిషబ్ వివాదం ఇంకా ముగియలేదా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక అభిమానులు కావాలనే రష్మికని అవాయిడ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడితే, రిషబ్ అభిమానులు కన్నడ సినిమాలకు రష్మిక వ్యతిరేకం ట్యాగ్ చేయకపోయినా పర్లేదులే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో రష్మిపై-రిషబ్ వివాదం మరోసారి ట్రెండింగ్ లో ఉంది.