Rashmika Mandanna : బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక.. విజయ్ దేవరకొండ వల్లేనా??

తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ, అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సినిమాలో రష్మిక ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇటీవల ముంబయ్‌లోని కరణ్‌ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్‌............

Rashmika Mandanna : బాలీవుడ్ లో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక.. విజయ్ దేవరకొండ వల్లేనా??

Rashmika

Rashmika Mandanna :  ప్ర్తస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. ఇటీవల ‘పుష్ప’ సినిమాతో భారీ విజయం అందుకుంది. ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది రష్మిక. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రష్మికకి ‘పుష్ప’ సినిమా బాగా ప్లస్ అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో రష్మిక నటించిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. రష్మిక నటించిన హిందీ చిత్రాలు ‘మిషన్‌ మజ్ను, గుడ్‌ బై’ ఈ సమ్మర్ లో విడుదల కానున్నాయి.

తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ, అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సినిమాలో రష్మిక ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇటీవల ముంబయ్‌లోని కరణ్‌ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్‌ కార్యాలయానికి రష్మిక వెళ్లడంతో పాటు చాలా సేపు ఆ సంస్థ కార్యాలయంలో ఉండటంతో బాలీవుడ్ లో ఈ టాక్ వినిపిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించబోయే ఓ సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు సంస్థ కార్యాలయంలో జరిగాయని బాలీవుడ్ టాక్‌.

Vijay Devarakonda : ఒడిశా సముద్ర తీరంలో ‘లైగర్’.. సైకత శిల్పంతో

ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ పూరి జగన్ తో కలిసి విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్, కరణ్ జోహార్ బాగా క్లోజ్ అవ్వడం కూడా మనం చూశాం. ఇక విజయ్ రష్మిక ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. దీంతో విజయ్ ధర్మ ప్రొడక్షన్ లో సినిమాకి రష్మికని సజెస్ట్ చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా టాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్నారు.