Vijay – Rashmika : విజయ్‌తో రిలేషన్.. రష్మిక రిప్లై ఏంటంటే..!

విజయ్ దేరకొండతో తన రిలేషన్ గురించి ఓ నెటిజన్ అడగ్గా.. రష్మిక మందన్న కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది..

Vijay – Rashmika : విజయ్‌తో రిలేషన్.. రష్మిక రిప్లై ఏంటంటే..!

Rashmika Mandanna About Her Relation With Vijay Deverakonda

Vijay – Rashmika: రెండు, మూడు సినిమాల్లో కలిసి నటిస్తే.. ఆ హీరో, హీరోయిన్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఏదో ఉంది అనుకునే సంఘటనలు చాలానే చూశాం. తీరా సదరు హీరో, హీరోయిన్లను ప్రశ్నిస్తే ‘అబ్బే అదేం లేదు.. అంతా తూచ్.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే’.. అని ఆన్సర్ ఇవ్వడం కూడా షరామామూలే..

ఇప్పుడలాంటి సమాధానమే చెప్పింది కన్నడ చిన్నది రష్మిక మందన్న.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘గీతగోవిందం’ చేసింది. ఈ జంట ఆన్‌స్క్రీన్ పెయిర్ అదిరింది అంటూ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ లో మరోసారి తెరపంచుకున్నారు.

అప్పటినుండి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, విజయ్ – రష్మిక రిలేషన్‌లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికను ఓ నెటిజన్ ఇదే మాట అడిగాడు. ‘విజయ్ నాకు చాలా ఇష్టం.. మేం మంచి ఫ్రెండ్స్.. విజయ్ నా బెస్ట్ ఫ్రెండ్’ అంటూ కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది రష్మిక.. ప్రస్తుతం విజయ్ ‘లైగర్’, రష్మిక ‘పుష్ప’ సినిమాలతో బిజీగా ఉన్నారు.