IPL 2023 : IPL ఓపెనింగ్ మ్యాచ్ లో.. రష్మిక మందన్నా, తమన్నా స్పెషల్ పర్ఫార్మెన్స్..

ఈ సారి IPL ఓపెనింగ్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వనున్నారు. IPL నిర్వాహకులు అధికారికంగా ప్రకటించగా ఇప్పటికే ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోల్ని......................

IPL 2023 : IPL ఓపెనింగ్ మ్యాచ్ లో.. రష్మిక మందన్నా, తమన్నా స్పెషల్ పర్ఫార్మెన్స్..

Rashmika Mandanna and Tamannaah special performances in IPL 2023 opening ceremony

IPL 2023 :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుండే ప్రారంభం కానుంది. నేడు మార్చి 31న సాయంత్రం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరగనుంది. IPL ఓపెనింగ్స్ గ్రాండ్ గా జరుగుతాయని తెలిసిందే. ఇటీవలే WPL కూడా ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ తారలు వచ్చి డ్యాన్సులు చేశారు, సింగర్స్ పాటలు పాడారు. IPL ఓపెనింగ్ కి కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఏర్పాటు చేశారు.

ఈ సారి IPL ఓపెనింగ్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వనున్నారు. IPL నిర్వాహకులు అధికారికంగా ప్రకటించగా ఇప్పటికే ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోల్ని కూడా షేర్ చేశారు. దీంతో అభిమానులు వీరి స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ సింగర్ ఆర్జిత్ సింగ్ తన సాంగ్స్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.

IPL 2023 : ఏ రోజు ఏ జట్టు మ్యాచ్ ఎవరితో, ఎక్కడ జరుగుతుంది.. IPL మ్యాచ్‌ల ఫుల్ డీటెయిల్స్..

నేటి మొదటి మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవ్వబోతుండగా ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ లు, ఓపెనింగ్ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల నుండే ప్రారంభమవుతాయి. ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో పాటు జియో సినిమాస్ యాప్ లో ఉచితంగా చూడొచ్చు.