Rashmika Mandanna : ఉర్ఫీ జావేద్‌ని ఫాలో అవుతున్న రష్మిక.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజెన్లు కామెంట్లు!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఏదో విషయంలో నెటిజెన్లు నుంచి విమర్శలు ఎదురుకుంటూనే ఉంటుంది. కాగా ఇప్పుడు మరోసారి ట్రోలింగ్ ఎదురుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోని...

Rashmika Mandanna : ఉర్ఫీ జావేద్‌ని ఫాలో అవుతున్న రష్మిక.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజెన్లు కామెంట్లు!

Rashmika Mandanna

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఏదో విషయంలో నెటిజెన్లు నుంచి విమర్శలు ఎదురుకుంటూనే ఉంటుంది. ఇటీవల కాలంలో కాంతార సినిమా విషయం గురించి, సౌత్ సినిమా పాటలు గురించి తీవ్రంగా ట్రోలింగ్ కి గురైంది. కాగా ఇప్పుడు మరోసారి ఇటువంటి ట్రోలింగ్ ఎదురుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోని ఒక అవార్డుల ఫంక్షన్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో రష్మిక డ్రెస్సింగ్ కి నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఫంక్షన్ కి రష్మిక బ్లాక్ డ్రెస్ లో వచ్చింది. అయితే ఆ డ్రెస్ చాలా షార్ట్ గా చూడడానికి ఇబ్బందిగా ఉంది.

Rashmika Mandanna : బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ కాంట్రవర్సీపై స్పందించిన రష్మిక..

బాలీవుడ్ లో ఇటువంటి డ్రెస్సింగ్ తో బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్‌ విసుగు తెప్పిస్తుంది. ఇప్పుడు రష్మిక కూడా ఆమెలా డ్రెస్సింగ్ స్టైల్ తో దర్శనం ఇచ్చేపాటికి నార్త్ ఆడియన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఫేమస్ అయినా తరువాత కూడా ఇలా ఎక్స్‌పోజింగ్ చేయవల్సిన అవసరం ఏముంది అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు ఆమె ఉర్ఫీ జావేద్‌ని ఫాలో అవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక సౌత్ ఆడియన్స్ అయితే ఆమె బాలీవుడ్ కి వెళ్లాకే ఇలా చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ విషయం పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. మరి ఈ ట్రోలింగ్ ని రష్మిక ఎలా ఎదురుకుంటుందో చూడాలి.

కాగా రష్మిక చేతిలో ప్రెజెంట్ రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి బాలీవుడ్ లో రణ్‌బీర్ సరసన నటిస్తున్న ‘యానిమల్’ మూవీ. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తీ అయ్యింది. ఆగష్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో రష్మిక కెరీర్ కొనసాగాలి అంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యి తీరాలి. ఎందుకంటే ఈ అమ్మడు నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు హిట్టు కాలేక పోయాయి. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప-2 లో నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)