Rashmika Mandanna : బర్త్‌డే స్పెషల్.. దుల్కర్‌తో రష్మిక.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

తాజాగా ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుల్కర్....

Rashmika Mandanna : బర్త్‌డే స్పెషల్.. దుల్కర్‌తో రష్మిక.. యుద్ధంతో రాసిన ప్రేమకథ..

Rashmika

 

Rashmika Mandanna :  ఇవాళ ఏప్రిల్ 5న రష్మిక మందన్నా బర్త్ డే సందర్భంగా నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు తనకి విషెస్ తెలియచేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. నేషనల్ క్రష్ గా అందరికి ఫేవరేట్ అయిపోతుంది. తెలుగు, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ రష్మికకి ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. యుద్ధం, ప్రేమ కాన్సెప్టుతో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయాన్ని ఇవాళ పోస్టర్ రిలీజ్ చేసి తెలిపారు. ఈ పోస్టర్ లో హ్యాపీ బర్త్ డే అఫ్రీన్ అని ఉంది. ఇందులో రష్మిక ముస్లిం అమ్మాయిలా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 1964 లో జరిగిన స్టోరీలా ఈ సినిమా ఉండబోతుంది.

Galla Ashok : రాడిసన్ ఘటనపై స్పందించిన మహేష్ మేనల్లుడు

యుద్ధం, ప్రేమ కాన్సెప్టుతో దుల్కర్ సల్మాన్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రష్మిక కొత్త లుక్ లో ఉండటంతో ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.