Rashmika : రోజు వారి డైరీ బయటపెట్టిన రష్మిక.. అతన్ని ఎందుకు కలుస్తుంది? ఆందోళనలో అభిమానులు..

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికరంగా ఓ పోస్ట్ పెట్టింది. రష్మిక తాను రోజు వారి రాసుకునే డైరీని సింపుల్ గా షార్ట్ ఫామ్ లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాత్రి పడుకునేముందు ఈ పోస్ట్ పెట్టి..............

Rashmika : రోజు వారి డైరీ బయటపెట్టిన రష్మిక.. అతన్ని ఎందుకు కలుస్తుంది? ఆందోళనలో అభిమానులు..

Rashmika Mandanna post her daily life in Social media with an interesting matter

Rashmika :  నేషనల్ క్రష్ రష్మిక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే సంక్రాంతికి వారసుడు సినిమాతో వచ్చి ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్, యాడ్స్ తో బిజీబిజీగా ఉంది రష్మిక. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో రోజూ అభిమానులని, నెటిజన్లని అలరిస్తుంది.

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికరంగా ఓ పోస్ట్ పెట్టింది. రష్మిక తాను రోజు వారి రాసుకునే డైరీని సింపుల్ గా షార్ట్ ఫామ్ లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాత్రి పడుకునేముందు ఈ పోస్ట్ పెట్టి ఆ రోజు ఏమేమి చేసిందో పోస్ట్ చేసింది. తన ఫోటోతో పాటు.. డియర్ డైరీ, ఇవాళ చాలా ఆసక్తికరంగా గడిచింది. లేవగానే కార్డియో వర్కౌట్ చేశాను. ఆ తర్వాత తిన్నాను. రేపటి షూటింగ్ షెడ్యూల్ కోసం బ్యాగ్ సర్దుకున్నాను. బయటకి వెల్దామనుకున్నాను కానీ వాతావరణం బాగోకపోవడం, మంచు ఉండటంతో ఆగిపోయాను. ఆ తర్వాత మళ్ళీ వర్కౌట్ చేశాను. ఇంట్లోనే ఉన్నాను. డెర్మట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కానీ అది క్యాన్సిల్ అయింది. ఇంకా అంతే పడుకుంటున్నాను, గుడ్ నైట్ మీరు కూడా పడుకోండి అని పోస్ట్ చేసింది.

Sreeleela : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శ్రీలీల.. ఛాలెంజ్ ఎవరికీ విసిరిందో తెలుసా??

అయితే ఈ డైరీలో డెర్మట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అని ఉంది. అంటే డెర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది. చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను డెర్మటాలజిస్ట్ అంటారు. రష్మికకి డెర్మటాలజిస్ట్ తో పనేంటి? ఎందుకు అపాయింట్మెంట్ తీసుకుంది? ఎందుకు డెర్మటాలజిస్ట్ ని కలుస్తుంది రష్మిక అని పలువురు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తనకి ఏమైనా అయిందా? రష్మిక ఏదైనా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందా? అని కామెంట్స్ చేస్తూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి రష్మిక డెర్మటాలజిస్ట్ ని ఎందుకు కలుస్తుందో తనకే తెలియాలి. అభిమానులు, నెటిజన్లు అడిగిన వాటికి ఏమైనా సమాధానం చెప్తుందో చూడాలి.