Rashmika Mandanna : విజయ్‌కి అందరి ముందు దిష్టి తీశాను అంటున్న హీరోయిన్..

తాజాగా రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ''స్కూల్‌ రోజుల నుంచే విజయ్‌ నా అభిమాన హీరో. ఆయనతో ఇలా సినిమా చేస్తానని కలలో కూడా ఊహించలేదు. విజయ్ తో సినిమా ఛాన్స్‌ అనగానే,,,,,,,,,,,,,,

Rashmika Mandanna : విజయ్‌కి అందరి ముందు దిష్టి తీశాను అంటున్న హీరోయిన్..

Rashmika (1)

 

Vijay :  సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ, సక్సెస్ సాధిస్తూ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు ఓకే చేసింది రష్మిక. ఇటీవల పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ అభిమానులని సంపాదించుకొని మరింత స్టార్ గా ఎదిగింది. తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది రష్మిక.

రష్మిక చేతిలో ప్రస్తుతం మూడు బాలీవుడ్ సినిమాలు, రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ్ సినిమా ఉన్నాయి. ఇందులో తమిళ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమా ఉంది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ 66వ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ జరుగగా అందులో రష్మిక విజయ్ ని చూసి ఆశ్చర్యపోవడం, చాలా స్పెషల్ గా ఫీల్ అవ్వడం చేసింది. రష్మిక ఎప్పట్నుంచో విజయ్ ఫ్యాన్ కావడంతో రష్మిక ఆ రోజు చాలా ఎగ్జైట్ అయిందని అంతా అనుకున్నారు.

Pawan Kalyan : అకిరా కోసం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసిన పవన్, రేణు దేశాయ్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

తాజాగా రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”స్కూల్‌ రోజుల నుంచే విజయ్‌ నా అభిమాన హీరో. ఆయనతో ఇలా సినిమా చేస్తానని కలలో కూడా ఊహించలేదు. విజయ్ తో సినిమా ఛాన్స్‌ అనగానే వెంటనే ఓకే చెప్పేసాను. విజయ్ పక్కన నటిస్తున్నాను అని తెలియగానే నా ఆనందందానికి హద్దులు లేవు. షూటింగ్‌ మొదటి రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. మొదటి రోజు క్లాప్‌ కొట్టిన తర్వాత విజయ్‌కు దిష్టి తీసి ఆయన పట్ల నాకున్న అభిమానాన్ని చూపించాను. నేను దిష్టి తీయగానే విజయ్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు, సెట్‌లో ఉన్న వాళ్లంతా నవ్వుకున్నారు. కానీ నా వరకు అతను ఫేవరేట్ హీరో. ఒక ఫ్యాన్ గర్ల్ గా నేను ఈ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను” అని తెలిపింది. ఇది విన్నాక, ఆ రోజు రష్మిక చేసిన అల్లరి చూశాక ఇక సినిమా అయి, రిలీజ్ అయ్యేంతవరకు విజయ్ తోనే కలిసి పని చేయాలి దానికి ఎంత ఎగ్జైట్ అవుతుందో అని అంటున్నారు నెటిజన్లు.