Rashmika Mandanna: ఐటెం పాపగా శ్రీవల్లి.. అంతా సోదేనా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన ‘పుష్ప-ది రైజ్’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన యావత్ ఇండియాలో అభిమానులను సొంతం చేసుకుంది......

Rashmika Mandanna: ఐటెం పాపగా శ్రీవల్లి.. అంతా సోదేనా..?

Rashmika Mandanna Special Item Song Is Just Rumour

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన ‘పుష్ప-ది రైజ్’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో నటించిన యావత్ ఇండియాలో అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ క్రియేట్ అయ్యింది.

Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి

అయితే గతకొద్ది రోజులుగా రష్మిక మందన ఓ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘జనగణమన’ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో రష్మిక మందన ఓ ఐటెం సాంగ్ చేస్తుందనే వార్త సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. కాగా, తాజాగా ఈ వార్తపై చిత్ర యూనిట్ నుండి క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో రష్మిక మందన ఎలాంటి ఐటెం సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది.

Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే

ఈ సినిమాను దేశభక్తి చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో, ఇందులో ఐటెం సాంగ్‌కు ఎలాంటి స్కోప్ లేదని, అందుకే ఈ సినిమాలో రష్మిక ఉంటుందనే వార్తలు కేవలం పుకార్లేనని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. మొత్తానికి రష్మిక మందన ఐటెం సాంగ్ వార్తలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడటంతో, ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.