Rashmika Mandanna: మరోసారి ఆ హీరోకు ఓకే చెబుతున్న రష్మిక..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తనదైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్‌గా ఈ బ్యూటీ అదిరిపోయే ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ బ్యూటీ.

Rashmika Mandanna: మరోసారి ఆ హీరోకు ఓకే చెబుతున్న రష్మిక..?

Rashmika Mandanna To Romance Nithiin Once Again

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తనదైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్‌గా ఈ బ్యూటీ అదిరిపోయే ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ బ్యూటీ.

Rashmika Mandanna : రష్మికని వాళ్ళ అమ్మ, నాన్న ఏమని పిలుస్తారో తెలుసా??

ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్‌బై అనే సినిమాలో నటంచగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ మూవీ ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌లో పాగా వేయాలని చూసింది ఈ బ్యూటీ. కానీ, ఈ సినిమాను మేకర్స్ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతుండటంతో, ఇప్పుడు మళ్లీ సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది రష్మిక. ఈ క్రమంలోనే గతంలో రష్మిక నటించిన ఓ హీరోతో మరోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోందట.

Rashmika Mandanna : చాలా మంది మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు.. విజయ్ తో కలిసి మళ్ళీ సినిమా చేస్తా..

టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన భీష్మ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో ట్రెడీషినల్ లుక్‌తో రష్మిక మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను తీసుకోవాలని దర్శకుడు వెంకీ కుడుముల భావిస్తున్నాడు. మరి నిజంగానే నితిన్‌తో మరోసారి రొమాన్స్‌కు రష్మిక ఓకే చెబుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.