Rashmika Mandanna : చాలా మంది మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు.. విజయ్ తో కలిసి మళ్ళీ సినిమా చేస్తా..

రష్మిక, విజయ్ పై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం వాటిపై స్పందించట్లేదు. అడిగితే మంచి ఫ్రెండ్ అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ కి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై రష్మిక................

Rashmika Mandanna : చాలా మంది మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు.. విజయ్ తో కలిసి మళ్ళీ సినిమా చేస్తా..

Rashmika Mandanna wants to act with vijay devarakonda again

Rashmika Mandanna :  రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రష్మిక నటించిన తమిళ సినిమా వరిసు, హిందీ సినిమా మిషన్ మజ్ను రిలీజ్ కి ఉన్నాయి. దీంతో ప్రమోషన్స్ తో బిజీగా అంది రష్మిక. బాలీవుడ్ లో మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో సినిమా గురించి మాట్లాడింది.

రష్మిక, విజయ్ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. గీత గోవిందం సినిమా పెద్ద హిట్ అవ్వగా, డియర్ కామ్రేడ్ పరాజయం చూసింది. అయితే ఈ రెండు సినిమాలతో వీళ్లిద్దరి మధ్య మంచి బాండ్ ఏర్పడింది. వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? డేటింగ్ చేస్తున్నారా అంటూ అనేక గాసిప్స్ వస్తున్నాయి. ఇక ఇద్దరూ మాల్దీవ్స్ కి వెళ్లారని, అక్కడ బాగా ఎంజాయ్ చేసారని కూడా బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

రష్మిక, విజయ్ పై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం వాటిపై స్పందించట్లేదు. అడిగితే మంచి ఫ్రెండ్ అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ కి అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై రష్మిక బాలీవుడ్ ప్రమోషన్స్ లో మాట్లాడింది.

Rashmika Mandanna : ఒక అమ్మలా సమంతని దగ్గరుండి చూసుకోవాలని ఉంది.. నా ఇన్స్పిరేషన్ తనే..

రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను విజయ్ దేవరకొండతో కలిసి ఏ సినిమా చెయ్యట్లేదు. కానీ చాలా మంది మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అడుగుతున్నారు. అతనితో వర్క్ అంటే నాకు కూడా ఇష్టమే. నేను కూడా విజయ్ తో కలిసి మళ్ళీ పనిచేయాలనుకుంటున్నాను. మంచి కథ దొరకాలి. మా యిద్దరికీ సరిపడే కథ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. కచ్చితంగా అతనితో త్వరలోనే మళ్ళీ సినిమా చేస్తాను అని తెలిపింది. దీంతో వీరిద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.