Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ కోసం వెయిట్ చేస్తున్న రష్మిక..

సౌందర్య రోల్ నాకు ఆఫర్ చేయండంటూ ఇన్‌డైరెక్ట్‌గా మేకర్స్‌కి హింట్ ఇచ్చింది రష్మిక..

10TV Telugu News

Rashmika Mandanna: తన సూపర్ డ్రీమ్‌ని రివీల్ చేసింది రష్మికా. సౌందర్యలా నటించాలనుందని ప్రకటించేసింది. 90s జనరేషన్‌కి పరిచయం అక్కర్లేని పేరు సౌందర్య. ఎప్పటినుంచో ఈ హీరోయిన్ బయోపిక్ రానుందనే ప్రచారమూ జరుగుతోంది. అయితే అది ప్రచారంలో ఉండగానే సౌందర్య రోల్ నాకు ఆఫర్ చేయండంటూ ఇన్‌డైరెక్ట్‌గా మేకర్స్‌కి హింట్ ఇచ్చింది రష్మికా.

Bigg Boss 5 Telugu : ఉమా దేవి ఎలిమినేషన్‌..! కారణం ఏంటంటే..?

సౌందర్యగా కనిపించేందుకు నేను రెడీ అంటోంది రష్మికా. బయోపిక్‌ల హవా నడుస్తున్న రీసెంట్ డేస్‌లో ముందే సౌందర్య రోల్ కోసం కర్చీఫ్ వేసింది. అయితే అది తన డ్రీమ్ రోల్ అని అనౌన్స్ చేసింది. చిన్నప్పటి నుంచి అందరూ తనని సౌందర్యలా ఉన్నావని పొగిడేవారని.. ఆమె తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది. సౌందర్య రోల్ కోసం తాను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని.. ప్లీజ్ అవకాశం ఇవ్వండని ఈ నేషనల్ క్రష్ రిక్వెస్ట్ చేసింది.

Soundarya

 

సౌత్ ఇండియా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో సౌందర్య గురించి ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే లక్షల వ్యూస్ సాధిస్తున్నాయి. ‘అభినవ సావిత్రి’ అనే బిరుదు సొంతం చేసుకున్న సౌందర్య.. సీనియర్ స్టార్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించారు. సౌందర్య బయోపిక్‌కు సంబంధించి టాలీవుడ్‌లో ఎప్పటినుంచో ట్రైల్స్ జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పటి కన్నడ అందాలనటి గురించి ఇప్పటి కన్నడ కస్తూరి రష్మిక చేసిన కామెంట్స్‌తో సౌందర్య బయోపిక్ మరోసారి చర్చకు వచ్చింది.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

గతంలో సౌందర్య బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు కీర్తి సురేష్, నిత్యా మీనన్, సాయి పల్లవిల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రష్మిక చేరిపోయింది. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సౌందర్య జీవితాన్ని చూపించేందుకు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. రష్మిక కలను కన్సిడర్ చేస్తారా చూడాలి. మరోవైపు టాలీవుడ్ టు బాలీవుడ్ ఫుల్ బిజీ హీరోయిన్ రష్మికా. ‘పుష్ప’, ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆమె చేతిలో.

Bigg Boss 5 Telugu : నింద వేసింది.. సారీ చెప్పి హగ్ ఇచ్చింది..

బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. క్రేజీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు హీరోయిన్స్. కొందరైతే ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అవును, సెట్స్ మీద కొన్ని క్రేజీ బయోపిక్ మూవీస్ ఉన్నాయి. వాటితో పాటు త్వరలో సెట్స్ పైకెళ్తాయని ప్రచారం జరుగుతున్న ట్రెండీ బయోపిక్స్‌పై హ్యావ్ ఎ లుక్..

Soundarya Biopic

 

అప్పుడప్పుడు బయోపిక్స్ వచ్చినా.. ఈ ట్రెండ్ మాత్రం ‘డర్టీ పిక్చర్’ తోనే ఫామ్‌లోకి వచ్చిందని చెప్పొచ్చు. సిల్క్ స్మితగా విద్యా బాలన్ చేసిన ‘డర్టీ పిక్చర్’ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. కాసులు కురిపించడమే కాదు.. విద్యాకు నేషనల్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల్లో ఆయన భార్య బసవతారకంగా మెప్పించింది. తర్వాత మ్యాథ్స్ జీనియస్ ‘శకుంతలా దేవి’ రోల్‌లో మెస్మరైజ్ చేసింది. ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా విద్యా బయోపిక్స్ చేస్తూనే ఉంది.

Vidya Balan

 

హీరోయిన్స్‌లో బయోపిక్ క్వీన్ అనిపించుకుంటోంది కంగనా రనౌత్. ‘మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ లో ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా, ‘తలైవి’ లో జయలలితగా క్రేజ్ తెచ్చుకున్న కంగనా త్వరలో ‘దిద్ద క్వీన్‌’ గా, ‘ఎమర్జెన్సీ’ లో ఇందిరా గాంధీగా, సీతగా ఇలాంటి డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటోంది. బయోపిక్ క్వీన్ అనిపించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే నాలుగు నేషనల్ అవార్డ్స్ అందుకున్న కంగనా ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇలా బయోపిక్స్ బాట పడుతోంది.

Kangana Ranaut

 

ఇక ‘మహానటి’ సావిత్రిగా నటించి ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది కీర్తి సురేష్. సావిత్రి రోల్‌కి జీవం పోసింది. అందరి ప్రశంసలతో పాటూ నేషనల్ అవార్డ్ అందుకుంది. షకీలా రోల్ రిచా చద్దా చేసింది. వుమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’ లో తాప్సీ నటిస్తోంది. వుమెన్ క్రికెట్ టీమ్ ఫాస్ట్ బౌలర్ జులాన్ గోస్వామిగా కనిపించేందుకు అనుష్కా శర్మ రెడీ అవుతోందని అంటున్నారు. ఇక దివ్య భారతి, సౌందర్య బయోపిక్స్ తెరపైకొస్తాయనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది. మరీ బయోపిక్స్.. ముఖ్యంగా సౌందర్యగా రష్మికా కనిపిస్తుందో కీర్తి సురేష్ స్టీల్ చేస్తుందో… ముందు ముందు తెలుస్తుంది..

 

10TV Telugu News