Rashmika Mandanna : షార్ట్ నిక్కర్‌లో ‘సామి.. సామి..’ అంటున్న రష్మిక.. ఇది కూడా ప్రమోషన్స్‌లో భాగమే..

మోషన్స్ లో భాగంగా రష్మిక మరోసారి 'సామి.. సామి..' సాంగ్ కి ఆ స్టెప్ తో డ్యాన్స్ వేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. ఇందులో షార్ట్ నిక్కర్ లో రష్మిక......

Rashmika Mandanna : షార్ట్ నిక్కర్‌లో ‘సామి.. సామి..’ అంటున్న రష్మిక.. ఇది కూడా ప్రమోషన్స్‌లో భాగమే..

Rashmika Dance

Rashmika Mandanna :  అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వనుంది. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి విపరీతమైన స్పందన వచ్చింది. అందులో పాటలు బాగా వైరల్ అయ్యాయి. అన్ని పాటలు రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ పాటల్లో ‘సామి.. సామి..’ అంటూ సాగే ఓ సాంగ్ లో రష్మిక వేసిన ఒక స్టెప్ బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ స్టెప్ ని రీల్స్ రూపంలో చేసి మరింత వైరల్ చేస్తున్నారు.

Rashmika Mandanna : ‘పుష్ప’ కోసం చీర కట్టిన శ్రీవల్లి

సినిమా రిలీజ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మరోసారి ‘సామి.. సామి..’ సాంగ్ కి ఆ స్టెప్ తో డ్యాన్స్ వేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. అయితే ఇందులో షార్ట్ నిక్కర్ లో రష్మిక ‘సామి.. సామి..’ అంటూ స్టెప్ వేయడంతో బాగా వైరల్ అవుతుంది. రష్మిక అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేసేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేసి.. చాలా మంది ఈ పాటకు రీల్స్‌ చేస్తుండడం నేను చూశాను. అందుకే నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. నేను కూడా ఈ స్టెప్ వేసి పార్టీలో చేరుతున్నాను. నాలాగే ఇంకా చాలా మంది ఈ డ్యాన్స్‌ చేసి ఈ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను అంటూ రష్మిక తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.