Rasool Pookutty : RRR గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు విన్నర్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బాహుబలి నిర్మాత..

తాజాగా ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ అనే చెత్త సినిమాను చూసాను అని పోస్ట్ చేయడంతో సౌండ్ మిక్సింగ్ లో ఆస్కార్ అవార్డు సాధించిన ఇండియన్ రసూల్ పూకుట్టి ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఇది గే స్టోరీ అని...............

Rasool Pookutty : RRR గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు విన్నర్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బాహుబలి నిర్మాత..

Rrr

RRR :  ఒకపక్కన RRR సినిమాని పొగుడుతుంటే మరో పక్క విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరో పక్క RRR గే సినిమా అని అనే వాళ్ళు ఉన్నారు. సినిమా చూసిన తర్వాత మొదట ఆర్జీవీనే ఇది గే సినిమాలా ఉందని అన్నాడు. ఆర్జీవీ ఎప్పటిలాగానే వాగుతున్నాడని విమర్శలు చేశారు. ఇక RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పాకింది. వేరే దేశాల ప్రేక్షకులు, సినీ పరిశ్రమ వాళ్ళు RRRని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు, ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు.

కానీ చాలా మంది RRR గే సినిమా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. వేరే దేశాల్లో RRRని గే సినిమాగానే చూసి ట్వీట్స్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో RRR నిజంగానే గే సినిమా అని ట్విట్టర్ లో ట్రేండింగ్ అయింది. దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటిదాకా స్పందించకపోయినా అభిమానులు మాత్రం ఆ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి RRR మళ్ళీ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఇండియన్స్ కూడా కొంతమంది ఇది గే స్టోరీ అని కామెంట్స్ చేస్తున్నారు.

Sukumar : ‘పుష్ప 2’లో విజయ్ సేతుపతి.. మరో విలన్‌గా కన్ఫర్మ్..

తాజాగా ఓ నెటిజన్ ఆర్ఆర్ఆర్ అనే చెత్త సినిమాను చూసాను అని పోస్ట్ చేయడంతో సౌండ్ మిక్సింగ్ లో ఆస్కార్ అవార్డు సాధించిన ఇండియన్ రసూల్ పూకుట్టి ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఇది గే స్టోరీ అని కామెంట్ చేశాడు. దీంతో ఆస్కార్ అవార్డు విన్నర్ కూడా RRRని గే సినిమా అనడంతో చరణ్, ఎన్టీఆర్ అభిమానులు రసూల్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే రసూల్ చేసిన ట్వీట్ కి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చాడు.

రసూల్ పూకుట్టి చేసిన ట్వీట్ కి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రిప్లై ఇస్తూ.. ”నువ్వు చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ సినిమా గే స్టోరీలా నాకు అనిపించలేదు. ఒకవేళ అది గే స్టోరీ అయినా తప్పేంటి? అదేమైనా చెడ్డ విషయమా? నువ్వు అలా ఎలా అంటావు? నీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోగలవు? మీరు ఇలా దిగజారడం నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది” అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి.