రూలర్ లో తన గెటప్ వెనుక కథ చెప్పిన బాలయ్య

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 02:30 PM IST
రూలర్ లో తన గెటప్ వెనుక కథ చెప్పిన బాలయ్య

నందమూరి నటసింహం నటించిన తాజా మూవీ రూలర్. కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రూలర్ సినిమా గురించి, అందులో తన పాత్రల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు బాలయ్య. మూవీలోని ఫస్ట్ లుక్ గురించి, టోనీ పాత్ర గురించి బాలకృష్ణ ప్రత్యేకంగా చెప్పారు. ఓ అభిమాని తనకు ఓ ఫొటో పంపారని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

ఆ ఫొటో చాలా డిఫరెంట్ గా ఉందని బాలకృష్ణ అన్నారు. ఆ ఫొటో చూశాకే టోని గెటప్ పుట్టిందన్నారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయిందన్నారు. ముందు.. డైరెక్టర్ వద్దన్నారని, తర్వాత అంగీకారం తెలిపారని బాలకృష్ణ వివరించారు. రూలర్ మూవీలో ఫస్ట్ లుక్ విడుదల చేసిన సమయంలో ఇండియా ట్రెండింగ్ లో నిలిచిందని బాలకృష్ణ గర్వంగా చెప్పారు. టాప్ ట్రెండింగ్ లో మూడు నిలవగా.. అందులో తన ఫస్ట్ లుక్ ఒకటి అన్నారు. కచ్చితంగా ఈ మూవీ.. అందరిని మెప్పిస్తుందని బాలయ్య నమ్మకం వ్యక్తం చేశారు.

* డిసెంబర్ 20న రూలర్ రిలీజ్
* ఈ సినిమాలో మూడు డిఫరెంట్ రోల్స్ చేసిన బాలయ్య
* ఎమోషన్, యాక్షన్, కామెడీ కలిసిన సినిమా రూలర్
* రూలర్ లో అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయన్న బాలయ్య
* మూవీ కోసం స్లిమ్ గా, ఫిట్ గా తయారైన నందమూరి హీరో
* కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రూలర్ మూవీ
* ఎప్పుడో అనుకున్న కథ ఇప్పుడు కుదిరిందన్న బాలయ్య
* టైటిల్ ఇచ్చినందుకు బోయపాటికి కృతజ్ఞతలు
* ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్న బాలయ్య
* మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన బాలయ్య