Ravanasura Movie: ఇదెక్కడి మాస్ మావా.. రవితేజ సినిమా పెద్దలకు మాత్రమేనా..?

మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Ravanasura Movie: ఇదెక్కడి మాస్ మావా.. రవితేజ సినిమా పెద్దలకు మాత్రమేనా..?

Ravanasura Movie Completes Censor Works

Ravanasura Movie: మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. సక్సెస్ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘రావణాసుర’పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతూ రావడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Ravanasura Movie: రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసిన మాస్ రాజా!

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకోగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. రావణాసుర చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో మాస్ రాజా అభిమానులు అవాక్కయ్యారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌లలో మంచి ఫాలోయింగ్ ఉన్న రవితేజ సినిమా వస్తుందంటే, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆయన సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తారు. అలాంటిది, రవితేజ సినిమాకు A సర్టిఫికెట్ రావడంతో, ఈ ప్రభావం ఖచ్చితంగా కొన్ని వర్గాలపై పడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Ravanasura Trailer: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న రావణాసుర.. 10 మిలియన్ వ్యూస్‌తో మాస్ ఫీస్ట్

మరి సెన్సార్ బోర్డు ఇచ్చిన A సర్టిఫికెట్‌పై రావణాసుర చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించగా, హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ ఆర్ట్స్, RT టీమ్‌వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.