Bigg Boss 5 Telugu: అడ్డంగా బుక్కైన రవి.. క్లాస్ పీకిన నాగ్!

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తికాగా ఇంట్లోకి వెళ్లిన 19 మందిలో 6 గురు ఇంటి నుండి బయటకి పంపేశారు. ఇక ఉన్న వాళ్ళతో షో రక్తి కట్టించే బాధ్యతను మరింత..

Bigg Boss 5 Telugu: అడ్డంగా బుక్కైన రవి.. క్లాస్ పీకిన నాగ్!

Bigg Boss 5 Telugu (1)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తికాగా ఇంట్లోకి వెళ్లిన 19 మందిలో 6 గురు ఇంటి నుండి బయటకి పంపేశారు. ఇక ఉన్న వాళ్ళతో షో రక్తి కట్టించే బాధ్యతను మరింత ప్లాన్డ్ గా చేస్తున్న బిగ్ బాస్ ఈసారి హోస్ట్ నాగార్జున చేత కంటెస్టెంట్లకు క్లాస్ పీకించాడు. వీకెండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటి సభ్యులందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంచాల‌కులు త‌ప్పు చేస్తే బిగ్‌బాస్ అన‌ర్హ‌త వేటు వేస్తాడ‌ని ఇంటి స‌భ్యుల‌కు క్లారిటీ ఇస్తూనే అందరిపై ఒట్టు వేయటం ఏంటని యాని మాస్టర్ పై ఫైర్ అయ్యాడు నాగ్.

Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

నాగార్జున వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్స్ పై సీరియస్ అవగా మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవిని నిల్చోబెట్టి మరి అందరి ముందు పరువుతీశాడు. హౌస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని, విశ్వ, లోబోలకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున రవికి చివరగా కిల్లర్ టెడ్డీ ఇచ్చి క్లాస్ తీసుకున్నాడు. శ్వేతకు దిండును చింపాలనే ఐడియా ఇవ్వలేదని రవి అంటే.. రవి అబద్ధం ఆడుతున్నాడని రివర్స్ అయ్యింది శ్వేత. నువ్ స్ట్రాటజీలు చేయి రవి తప్పులేదు.. కానీ బ్లేమ్ చేయకు అంటూ రవిపై నాగ్ సీరియస్ అయ్యాడు.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

అంతేకాదు రవి చేసింది కరెక్టా తప్పా అన్నది హౌస్‌లో ఉన్నవాళ్లే చెప్పండి.. రవి చేసింది రైట్ అనేవాళ్లు చేతులు ఎత్తండి అని నాగార్జున అనడంతో ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదు. ర‌వి చేసింది రాంగ్ అనే వాళ్లు చేతులు ఎత్త‌కండి అంటే ఎవ‌రు ఎత్త‌లేదు. దీంతో రవి నిజం ఏంటో నాకు తెలుసు సర్.. నాకు అనిపించింది చేస్తా అని అన్నాడు రవి.. ఎవరైనా తప్పు చేస్తే చెప్పడం నా బాధ్యత అది నీకు చెప్తున్నా నీ ప్రవర్తన నీ ఇష్టం అన్నారు నాగార్జున. మొత్తానికి మరోసారి రవి అడ్డంగా దొరికిపోగా హౌస్ మేట్స్ ముందే నాగ్ క్లాస్ పీకి అవమానించాడు.