Bigg Boss 5 Elimination: రవి ఔట్.. అదే నిజమైతే విమర్శలు తప్పదా?

బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉండగా ఈరోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఉన్న ఎనిమిది మందిలో ఐదుగురు కంటెస్టెంట్ల మధ్యనే టైటిల్ ఫెవరెట్..

Bigg Boss 5 Elimination: రవి ఔట్.. అదే నిజమైతే విమర్శలు తప్పదా?

Bigg Boss 5 Elimination

Bigg Boss 5 Elimination: బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉండగా ఈరోజు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఉన్న ఎనిమిది మందిలో ఐదుగురు కంటెస్టెంట్ల మధ్యనే టైటిల్ ఫెవరెట్ అని బిగ్ బాస్ ప్రేక్షకులంతా భావిస్తున్నారు. మిగతా ముగ్గురిలో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని.. ముఖ్యంగా ప్రియాంకా, కాజల్ మధ్యనే ఈరోజు ఎలిమినేషన్ ఉండొచ్చని అంచనాలు వేసుకున్నారు. మరోవైపు ప్రియాంకా ఈ వారం తానే ఎలిమినేషన్ కావడం ఖాయమని ఇంట్లో మిగతా కంటెస్టెంట్లతో చెప్పకుంటూ వస్తుంది.

OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్

అయితే.. సోషల్ మీడియాలో మాత్రం యాంకర్ రవి ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రవి హౌస్ నుండి బయటకొచ్చేశాడని కథనాలు షికార్లు చేస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్ బాస్ నిర్వాహకులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్న కంటెస్టెంట్లలో టాప్ 3లో నిలవగల ఫ్యాన్ ఫాలోయింగ్ రవి సొంతం. ఖచ్చితంగా రవి పేరు టాప్ 5 లిస్టులో ఉండి తీరుతుందని ఈ షో ఫాలోవర్లు చెప్పే మాట. అయితే.. ఊహించని విధంగా ఈ వారం రవి ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియా కథనం.

Indian Actress: రెచ్చిపోతాం.. హాలీవుడ్‌లో ముద్దుగుమ్మల బోల్డ్ క్యారెక్టర్స్!

నిజంగా జరిగే ప్రచారానికి అనుగుణంగా రవినే ఎలిమినేషన్ అయితే పక్కా ప్లాన్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా ముందే రాసుకున్న స్క్రిప్ ప్రకారమే ఈ ఎలిమినేషన్ అని భావించాల్సి వస్తుందని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. ఇదే మాట సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తుంది. ముందు నుండే బిగ్ బాస్ షో ముందే రాసుకున్న అగ్రిమెంట్స్, ఫుల్ స్క్రిప్ట్ మీదనే నడుస్తుందని టాక్ నడుస్తుండగా.. రవి ఎలిమినేషన్ తో అదే నిజమని భావించాల్సి ఉంటుందని ప్రేక్షకుల మాట. మరి నిజంగానే రవిని ఎలిమినేట్ చేశారా.. లేక ఇది ప్రచారం మాత్రమేనా అన్నది ఈ రాత్రికే తెలుస్తుంది.