Bigg Boss 5 : లోబోతో ఉన్న రిలేషన్ గుర్తు తెచ్చుకొని ఏడ్చేసిన యాంకర్ రవి

చాలా మందికి రవి, లోబోల స్నేహం గురించి తెలుసు. పటాస్ షో సమయంలో వీళ్లిద్దరు కలిసి పని చేశారు. అప్పట్నుంచి లోబో, రవి మంచి స్నేహితులు. తాజాగా రవి లోబో గురించి చెప్తూ..

Bigg Boss 5 : లోబోతో ఉన్న రిలేషన్ గుర్తు తెచ్చుకొని ఏడ్చేసిన యాంకర్ రవి

Ravi Lobo

Bigg Boss 5 :  బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికి ఆరువారాలు పూర్తి చేసుకుంది. గొడవలతో, ఎమోషన్లతో, ఎలిమినేషన్లతో అప్పుడప్పుడు కొంచెం ఫన్ తో సాగిపోతుంది బిగ్ బాస్. మొన్న శనివారం రోజు లోబోని సీక్రెట్ రూంకి పంపించాడు నాగార్జున. ఈ విషయం కొంతమంది సభ్యులకు కూడా తెలియకుండా చేశారు. దీంతో లోబో ఎలిమినేట్ అయ్యాడేమోనని భావించిన కొందరు సభ్యులు ఎమోషనల్ అయ్యారు. రవి, విశ్వ, మానస్‌లు స్మోకింగ్ ఏరియాలో మాట్లాడుతున్న సమయంలో రవి లోబో గురించి మాట్లాడుతూ ఏడ్చేశాడు. రవి తనకు లోబోకు ఉన్న స్నేహం గురించి తెలిపాడు.

Manchu Vishnu : ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు నాకు అందలేదు: మంచు విష్ణు

చాలా మందికి రవి, లోబోల స్నేహం గురించి తెలుసు. పటాస్ షో సమయంలో వీళ్లిద్దరు కలిసి పని చేశారు. అప్పట్నుంచి లోబో, రవి మంచి స్నేహితులు. తాజాగా రవి లోబో గురించి చెప్తూ.. లోబో తండ్రి చనిపోయినప్పుడు మేమిద్దరం ఒకే చోటు ఉన్నాం. విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్లాం. లోబో తండ్రి రోడ్డు మీద అలా నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. వాడి తండ్రి చనిపోయిన సమయంలో మూడు రోజులు నేను వాడితోనే ఉన్నాను. మా ఇద్దరిమధ్య అంత కనెక్షన్ ఉంది అంటూ రవి ఎమోషనల్ అయ్యాడు. అంతే కాక గేమ్ లో లోబో చాలా సార్లు రవి చెప్పినట్టు వినడం కనిపిస్తూనే ఉంది. ఇటీవల నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకి కూడా రవి చెప్తేనే చేశాను అని అన్నాడు లోబో. ఇక ఎలిమినేషన్ టైంలో కూడా రవి అభిమానుల ఓట్లు కూడా లోబోకి పడుతుండటంతో ఇన్నాళ్లు సేవ్ అవుతూ వచ్చాడు. దీని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో అర్ధమవుతుంది.