Ravi Teja : మాస్ మహారాజ మొదలెట్టేశాడు..

రవితేజ 68వ మూవీ శ‌ర‌త్ మండ‌వ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నారు..

Ravi Teja : మాస్ మహారాజ మొదలెట్టేశాడు..

Ravi Teja 68th Movie Shoot Begins

Ravi Teja: ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ వరుస సినిమాలతో కెరీర్ స్పీడ్ పెంచేశారు. రవితేజ 68వ మూవీ శ‌ర‌త్ మండ‌వ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నారు. సుధాక‌ర్ SLV సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యానర్ల మీద సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ర‌వితేజతో పాటు ఇత‌ర తారాగ‌ణంపై హైద‌రాబాద్‌లో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ర‌వితేజ అటువైపు తిరిగి కుర్చొని ఎదో టైప్ చేస్తున్న‌ట్టు చూపించారు. పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్న‌ ఫైర్, ర‌వితేజ క్యారెక్టర్ యెక్క ఇంటెన్సిటిని చూపించే విధంగా ఉంది. ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖ, డెస్క్‌, టైప్‌రైటర్, ఫైల్స్ మొదలైన వాటిని పోస్ట‌ర్లో గమనించవచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

Ravi Teja 68

రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుంది. ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌. ర‌వితేజ స‌ర‌స‌న ‘మ‌జిలి’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. శ్యామ్ సి.ఎస్. సంగీతం, స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫీ, కె.ఎల్. ప్ర‌వీణ్ ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.