Ravi Teja : ‘విజేత’ సినిమా ఫంక్షన్ సమయంలో అనుకున్నది నెరవేర్చుకున్నా.. రవితేజ!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో రవితేజ సినిమాలోకి ఇంకా రాకముందు అనుకున్న ఒక విషయం ఇప్పుడు నెరవేరింది అంటూ అభిమానులకు తెలియజేశాడు.

Ravi Teja : ‘విజేత’ సినిమా ఫంక్షన్ సమయంలో అనుకున్నది నెరవేర్చుకున్నా.. రవితేజ!

Ravi Teja fulfill his dream

Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో రవితేజ సినిమాలోకి ఇంకా రాకముందు అనుకున్న ఒక విషయం ఇప్పుడు నెరవేరింది అంటూ అభిమానులకు తెలియజేశాడు.

Ravi Teja : రవితేజ కొడుకు ‘ఇడియట్-2’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా.. రవితేజ ఏమన్నాడంటే?

ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. “దర్శకుడు బాబీ జర్నీ గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యింది. నా జర్నీ విజయవాడ నుంచి మొదలయింది. నేను విజయవాడలో ఉన్న సమయంలో నాకు ఒక గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్ ని వేసుకొని విజయవాడ పిడబ్ల్యూ గ్రౌండ్స్ లో ‘విజేత’ సినిమా ఫంక్షన్ జరుగుతుంటే వెళ్ళాను. అయితే కొంచెం లేటుగా వెళ్ళాము. చిరంజీవి గారు ఎక్కడో ముందు ఉన్నారు. ఆయన్ని చూడడం కుదరలేదు. అప్పుడు మా వాళ్ళు అంతా బాధ పడ్డారు.

కానీ నేను మాత్రం ఒకటి అన్నా వాళ్లతో.. నేను ఫీల్ అవ్వడం లేదు. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన కోందడరామిరెడ్డి, భానుప్రియ గారు కూర్చున్నారు. ఒక రోజు నేను వెళ్లి అయన పక్కన కూర్చుంటాను అని మా ఫ్రెండ్స్ తో గట్టిగా చెప్పా అది ఇప్పుడు నిజం అయ్యింది. పక్కన కూర్చోడం కాదు ఆల్‌మోస్ట్ ఆయన సంక ఎక్కి కూర్చున్నా. అంత ప్రేమిస్తారు నన్ను ఆయన. మధ్యలో తొమ్మిదేళ్లు మిస్ అయ్యాము. ఇక మిస్ అవ్వద్దు అన్నయ్యా” అంటూ చిరంజీవితో ఇప్పుడు తనకున్న సాన్నిహిత్యం గురించి అభిమానులతో పంచుకున్నాడు.